Donald Trump: ట్రంప్ షాకింగ్ డెసిషన్.. 90 రోజులు సుంకాలకు బ్రేక్.. చైనాకు మాత్రం నో..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పరిపాలనలో విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఈ సడలింపు చైనాకు వర్తించదని స్పష్టంచేశారు. అమెరికా ఇప్పటివరకు దాదాపు 70 దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి ముదురుతోంది. తాజాగా చైనా వస్తువులపై అమెరికా సుంకాలను భారీగా పెంచింది. ఇప్పటి వరకు 104 శాతంగా ఉన్న సుంకాన్ని 125 శాతానికి పెంచినట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ ఉదయమే చైనా వస్తువులపై 104% సుంకాలు అమలులోకి వచ్చినట్టు ప్రకటించగా, చైనా కూడా వెంటనే స్పందించి అమెరికా వస్తువులపై 84% టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా ట్రంప్ మరింత కఠినంగా వ్యవహరించి, 125% సుంకాల పెంపును ప్రకటించారు.

“ప్రపంచ మార్కెట్ల పట్ల చైనా చూపుతున్న అవగాహన లేనితనమే ఈ చర్యలకు కారణం. అమెరికా, ఇతర దేశాలను చైనా దోచుకునే కాలం ఇకపై ఆమోదయోగ్యం కాదు అని వారు త్వరలోనే గ్రహిస్తారు” అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇక మరోవైపు, అమెరికా విధించిన కఠిన సుంకాలపై స్పందిస్తూ 75కిపైగా దేశాలు యుఎస్ ట్రేడ్ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించాయి. వాణిజ్య సమస్యలు, కరెన్సీ మానిప్యులేషన్, ఇతర ఆర్థిక అడ్డంకులపై సమాధానాల కోసం ఈ చర్చలు జరగనున్నాయి.

“ఈ దేశాల నుంచి ఏ విధమైన ప్రతీకార చర్యలు చేపట్టకుండా ఉన్నందున, నా సూచన మేరకు 90 రోజుల విరామం ఇస్తున్నాను. పరస్పర సుంకాలను తాత్కాలికంగా తగ్గించడానికి ఇది ఒక అవకాశం” అని ట్రంప్ స్పష్టం చేశారు.

Leave a Reply