Gold Card: ఐదు మిలియన్ డాలర్ల గోల్డ్ కార్డు తీసుకుంటే అమెరికా పౌరసత్వమా..? ప్రపంచ దేశాలకి షాక్ ఇస్తున్న ట్రంప్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. కానీ ఈసారి విషయం ఊహించని రేంజ్‌లో ఉంది. ఐదు మిలియన్ డాలర్లు చెల్లిస్తే నేరుగా అమెరికా పౌరసత్వం సాధ్యమవుతుందంటూ గోల్డ్ కార్డు వీసాను లాంచ్ చేశాడు. ఇది విన్నవాళ్లంతా “అంత డబ్బు పెట్టి పౌరసత్వం కొంటారా?” అంటూ షాక్‌కి గురవుతున్నారు.

ట్రంప్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఈ గోల్డ్ కార్డు ఏ లెవెల్లో ఉందంటే… పట్టెడు బంగారం లా మెరిసిపోతూ, అందులో ట్రంప్ ఫోటో ముద్రించి, రాయలవారి ముద్రలా ఉంది. దీన్ని చూసిన సామాన్యులు నోటిముందు వేలాడుతున్న పదహారులా చూస్తున్నారు.

ఒకప్పుడు అమెరికాలోకి రావాలంటే హార్డ్ వర్క్, కాలం, అదృష్టం అవసరం. కానీ ఇప్పుడు డబ్బుంటే చాలు అంటున్నారు. ట్రంప్ ప్లాన్ ప్రకారం.. ఈ కార్డు కొన్నవాళ్లకు గ్రీన్ కార్డ్ తరహా ప్రయోజనాలు లభిస్తాయి. ఆ తర్వాత పౌరసత్వం వచ్చే దారికి ఇది ఒక express highway లా ఉంటుందంటున్నారు.

ఇది సాదా వీసా కాదని, ఈబీ-5 వీసాను రద్దు చేసి, దాని స్థానంలో గోల్డ్ కార్డు తీసుకువచ్చామని ట్రంప్ చెబుతున్నాడు. “ఈ పథకం ద్వారా సంపన్నులు అమెరికాలో పెట్టుబడులు పెట్టే అవకాశం పెరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి. అమెరికా మేక్ గ్రేట్ అగేన్ అవుతుంది” అంటూ ట్రంప్ మళ్లీ తన trademark డైలాగ్ వేశాడు.

కానీ విమర్శకులు మాత్రం ఇది నేరుగా పౌరసత్వాన్ని అమ్మే స్కీమ్‌గా అభివర్ణిస్తున్నారు. “ఇది పౌరసత్వాన్ని డబ్బుతో కొనే వ్యవహారమా..? డబ్బు ఉన్నవాడికి అమెరికాలో అడుగు, లేనివాడికి తలుపు కూడా కనిపించదా?” అని ప్రశ్నిస్తున్నారు.

ఇంకా ట్రంప్ చెప్పిన మాటలు పరిగణలోకి తీసుకుంటే.. “నేనే గోల్డ్ కార్డు మొదటి కస్టమర్. తర్వాత మీరే చూడండి. రెండు వారాల్లో మొత్తం అమ్ముడవుతాయి” అని ఊహించని అంచనాలు పెంచేశాడు.

ఇండియాలో ఇప్పటికే ఎందరో కోటీశ్వరులు విదేశాల్లో సెటిలవ్వాలని చూస్తున్నారు. వాళ్లలో కొందరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.

సోషల్ మీడియాలో ట్రంప్ కొత్త గోల్డ్ కార్డు హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఇండియాలో ఉన్న NRI ఆశావాహులు, బిలియనీర్లు, సెలబ్రిటీలు ఈ కార్డు కోసం ఎదురు చూస్తారా..? లేదా అమెరికా పౌరసత్వం ఇంకా డ్రీమ్‌గానే మిగిలిపోతుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply