Russia: రష్యాలో మిస్టరీ వైరస్ భయం.. రక్తంతో కూడిన దగ్గు, తీవ్రమైన జ్వరం!

రష్యాలో ఓ మిస్టరీ వైరస్ విజృంభిస్తోంది అనే వార్తలు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తున్నాయి. ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సమస్యలు, దీర్ఘకాలిక జ్వరం, రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇది కొత్త వైరస్ కావొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రష్యాలో మిస్టరీ వైరస్.. అసలు సంగతి ఏమిటి?

మార్చి 29న పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు “రష్యాలో ఓ కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోంది” అని నివేదించాయి. ప్రజలు వారాల తరబడి జ్వరంతో బాధపడుతున్నారు. దగ్గుతోపాటు రక్తం కక్కుతున్నట్లు షాకింగ్‌ రిపోర్టులు వచ్చాయి. ఇది సాధారణ వైరస్ కాదు, కొవిడ్‌ తరహా కొత్త వైరస్ కావొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.

ఒక రష్యన్ మహిళ ఐదు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు చెప్పగా, కొన్ని రోజుల్లో దగ్గుతోపాటు రక్తం కూడా కారటం ప్రారంభమైందని వెల్లడించారు. ఎన్ని మందులు వాడినా వ్యాధి తగ్గలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

వైరస్ పై తీవ్ర భయాందోళనలు.. రష్యా ప్రభుత్వం ఏమంటోంది?

రష్యా ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను ఖండించింది. “ఇది కొత్త వైరస్ కాదు. మా పరిశోధనల్లో కొత్త రుగ్మతలు ఏవీ బయటపడలేదు” అని రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది. “ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. మైకోప్లాస్మా న్యుమోనియానే దీనికి కారణం” అని అధికారులు వెల్లడించారు.

అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ వైరస్ పై ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది “ఇది సరికొత్త వైరస్, అధికారులు నిజాన్ని దాచేస్తున్నారు” అంటూ ఆరోపిస్తున్నారు.

ప్రపంచ దేశాలు దీన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. కొవిడ్ తరహా మహమ్మారి అయితే, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఆందోళన చెందుతాయి. అయితే, ఇది నిజంగా కొత్త వైరస్ కాకపోతే, ప్రజల్లో ఉన్న భయాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి.

ఇది నిజంగా కొత్త వైరసేనా? లేక అనవసరమైన భయాలా? త్వరలో మరింత స్పష్టత రానుంది!

Leave a Reply