ఉద్యోగుల‌కు నిస్సాన్ మోటార్‌ భారీ షాక్.. ఒకేసారి 20 వేల మంది ఔట్

ప్రపంచవ్యాప్తంగా ఆటో పరిశ్రమను వణికిస్తున్న శకం ఇది. నిస్సాన్ మోటార్‌ కంపెనీ ఒక్కసారిగా 20,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతుండటం ప్రస్తుతం సంచలనంగా మారింది. అమెరికా, చైనాల్లో విక్రయాలు క్షీణించడంతో కంపెనీ ఆదాయం 94 శాతం తగ్గిపోయింది. దీంతో మొత్తం ఉద్యోగులలో 15 శాతం మందిని తొలగించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కరోనా తర్వాత గ్లోబల్ మార్కెట్లలో ఉద్యోగ క్షీణత కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు లేఆఫ్స్ ఎక్కువగా ఐటీ రంగాన్ని టార్గెట్ చేసినప్పటికీ, ఇప్పుడు ఆటో పరిశ్రమలోనూ ఉద్యోగుల భద్రత ప్రమాదంలో పడుతోంది. మొదట 9 వేల మంది ఉద్యోగులను తొలగించాలని భావించిన నిస్సాన్, ఇప్పుడు దానికి మరో 11 వేల మందిని చేర్చి, మొత్తంగా 20 వేల మందికి పింక్ స్లిప్ ఇవ్వబోతోంది.

అమెరికా, చైనా మార్కెట్లలో విక్రయాలు తీవ్రంగా పడిపోవడం, నిరంతరం తగ్గుతున్న డిమాండ్, కంపెనీ ఖర్చుల పెరుగుదల వంటి కారణాలే ఈ నిర్ణయానికి దారితీశాయని తెలుస్తోంది. అయితే కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Leave a Reply