నేపాల్‌లో కొత్త కుమారి ఆర్యతారా శక్యా నియామకం | Living Goddess Appointment 2025

నేపాల్‌లో 2 ఏళ్ల 8 నెలల చిన్నారి ఆర్యతారా శక్యాను కొత్త **కుమారి (లివింగ్ గాడెస్)**గా నియమించారు. ఈ నియామకం, నేపాల్‌లోని ప్రధాన హిందూ పండుగ దశైణ్ సందర్భంగా జరిగింది. ఆర్యతారా, 2017 నుండి పదవిలో ఉన్న మాజీ కుమారి త్రిష్ణా శక్యాను ప్రత్యామ్నాయం చేస్తోంది.

కుమారి సంప్రదాయం ప్రకారం, శాక్య కులానికి చెందిన చిన్నారులను వివిధ ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆమె శరీరంలో ఎలాంటి మచ్చలు ఉండకూడదు, కళ్ళు, దంతాలు, చర్మం వంటి శారీరక లక్షణాలు పూర్ణంగా ఉండాలి. అలాగే, భయము లేకుండా, ధైర్యవంతంగా ఉండగలగాలి. ఈ ఎంపిక కఠినమైన ఆధ్యాత్మిక, శారీరక ప్రమాణాలపై ఆధారపడుతుంది.

కుమారి పదవి కుటుంబానికి ఉన్నత సామాజిక స్థాయి, గౌరవాన్ని అందిస్తుంది. అయితే, పదవి ముగిసిన తర్వాత, మాజీ కుమారులు సామాజిక జీవితంలో తిరిగి పూర్తిగా మిళితమవడం కొంచెం కష్టతరమవుతుంది. వివాహం చేసుకోవడం మరియు సాధారణ జీవితంలో అడుగు పెట్టడం కొంతమందికి సవాలుగా మారుతుంది.

కుమారి పండుగల సమయంలో ఆమెను ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ప్రజల ముందుకు తీసుకోని వస్తారు, ప్రజలు ఆమెను పూజిస్తారు, పాదాలను తలతో తాకి ఆశీర్వచనలు పొందుతారు, మరియు వరాలు కోరుకుంటారు.

సంప్రదాయాలను కొనసాగిస్తూ, ఆధునిక కాలంలో కుమారులు ప్రైవేట్ విద్య, మీడియా పరిచయం వంటి అవకాశాలు పొందగలుగుతున్నారు. పదవి ముగిసిన తర్వాత, ఆమెకు ప్రభుత్వం నెలకు సుమారు $110 పెన్షన్ అందిస్తుంది.

Leave a Reply