Miss World 2025: హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు.. 20 రోజుల గ్రాండ్ ఈవెంట్ షెడ్యూల్ ఇదే!

హైదరాబాద్ మళ్లీ ఒకసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది మే 10 నుంచి 31 వరకు నగరంలో జరగనున్నాయి. ఇది 72వ మిస్ వరల్డ్ ఎడిషన్ కావడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం దీనికి ఆతిథ్యమిస్తూ, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని, పర్యాటక విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ పోటీలకు 120కు పైగా దేశాల నుంచి అందగత్తెలు హాజరుకానున్నారు. పోటీలు ప్రారంభం కాకముందే మే 6, 7 తేదీల్లో వారు హైదరాబాద్ చేరుకుంటారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మే 10న గ్రాండ్ ఓపెనింగ్ వేడుక జరగనుంది. ఇందులో తెలంగాణ జానపద నృత్యాలతో మిస్ వరల్డ్ అందగత్తెలకు సాంస్కృతిక స్వాగతం పలుకుతారు.

ప్రముఖ షెడ్యూల్ ఈవెంట్స్:

మే 12: నాగార్జున సాగర్, బుద్ధవన సందర్శన

మే 13: చార్మినార్, లాడ్ బజార్ కల్చరల్ వాక్ & చౌమహల్లా ప్యాలెస్ డిన్నర్

మే 14: వరంగల్ కళాక్షేత్రం & రామప్ప ఆలయం

మే 15: యాదగిరిగుట్ట, పోచంపల్లి చేనేత

మే 16: హాస్పిటల్స్ మెడికల్ టూర్

మే 17: స్పోర్ట్స్ ఫైనల్స్ & ఫుడ్ ఫెస్టివల్

మే 18-19: పోలీస్ కమాండ్ సెంటర్ టూర్

మే 20-21: గ్రూప్ 1 ఉప్పల్ APL మ్యాచ్, గ్రూప్ 2 శిల్పారామం

మే 22-24: ప్రతిభా ప్రదర్శనలు & ఫ్యాషన్ ఫినాలే

మే 26: ఫలక్‌నుమా గాలా డిన్నర్

మే 31: హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలే – మిస్ వరల్డ్ కిరీటం అందజేత

జూన్ 2: మిస్ వరల్డ్ విజేతలు సీఎం, గవర్నర్‌ను కలవడం

ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రమంతటా ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతోంది. పర్యాటక అభివృద్ధికి ఇది ఓ మైలురాయి కానుంది.

Leave a Reply