అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా వార్షిక రుసుమును $100,000 (సుమారు రూ.88 లక్షలకు పైగా) కు పెంచారు. ఈ సడెన్ నిర్ణయం వెనుక కారణాలపై నిపుణులలో వర్గీకరణ జరుగుతోంది. వైట్‌హౌస్ ప్రకారం, కొందరు అమెరికన్ కంపెనీలు స్థానిక ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో విదేశీ నిపుణులను నియమిస్తున్నాయి. అమెరికా వనరులు, ఉద్యోగాలు ముందుగా అమెరికన్లకే ఇవ్వాలని ట్రంప్ పునరావృతంగా పేర్కొంటున్నారు.
తాజా వివరాల ప్రకారం, ఒక కంపెనీ 16,000 అమెరికన్ ఉద్యోగులను తొలగించి, 5,189 H1B పర్మిషన్లు పొందింది. మరో కంపెనీ 1,698 వీసా పర్మిషన్లను పొందడంతో 2,400 ఉద్యోగులను తగ్గించింది. మూడవ కంపెనీ 25,075 H1B వీసాలను పొందగా, 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం 27,000 అమెరికన్ ఉద్యోగులు లేాఫ్ అయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మరో కంపెనీ 1,137 H1B వీసాలను పొందింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,000 మంది అమెరికన్ ఐటీ ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చారు. అమెరికన్ ఐటీ నిపుణులకు ముందే సమాచారం ఇవ్వకుండానే ఈ విధంగా ఉద్యోగం నుంచి తొలగించడం, అలాగే విదేశీ నిపుణులకు శిక్షణ ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం H1B వీసా ఫీజును భారీగా పెంచినట్లు తెలుస్తోంది.