ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువగా చిన్నపిల్లలకు మొబైల్ ఇవ్వడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఉదయం లేవగానే మొబైల్ చూపించటం వల్ల వారిలో రిటినా డ్యామేజ్ అవుతోంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో రంగులను గుర్తించలేని పరిస్థితి, కలర్ బ్లైండ్‌నెస్ లాంటి ముప్పులు వస్తున్నాయట. మెదడు పనితీరు మందగించడం, మానసిక వికాసం ఆగిపోవడం కూడా దీని వల్లే అని పరిశోధనలు చెబుతున్నాయి.
చిన్నపిల్లలు ఏడాది తరువాత మాటలు మాట్లాడటం మొదలుపెడతారు. అలాంటి సమయంలో మొబైల్ చేతిలో పెడితే వారు మనుషులతో మాట్లాడే అవకాశమే పోతుంది. ఫలితంగా, వారు రెండు మూడేళ్ల వయస్సు వచ్చినా సరైన మాటలు మాట్లాడలేరు. పెద్దయ్యాక కూడా కమ్యూనికేషన్ సమస్యలు, భయాలు, ఒంటరితన భావాలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.
పిల్లలకు ఈ సమయాల్లో కుటుంబ సభ్యుల తో సమయం గడిపేలా చేయాలి. అమ్మమ్మ, తాతయ్యలతో, తోబుట్టువులతో మాట్లాడేలా అలవాటు చేయాలి. ఇది వారికి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. మాటలతో పాటు భావాలను అర్థం చేసుకోవడం, స్పందించడం వంటి సామర్థ్యాలు పెరుగుతాయి. ఆటలతో, కథలతో, పాటలతో పిల్లలను ఆకర్షిస్తే మొబైల్ దూరం చేయవచ్చు.
పూర్వం ఈ టెక్నాలజీ లేకపోయిన రోజుల్లో పిల్లల మానసిక శారీరక ఆరోగ్యం బాగుండేది. ఇంట్లో అందరితో కలిసిపోతూ అభివృద్ధి చెందేవారు. కానీ ఇప్పుడు చిన్నతనంలోనే మొబైల్‌కి బానిసలవుతున్నా రు. దీని ఫలితంగా ఆటిజం లక్షణాలు, మెమొరీ లోపాలు, హైపర్ యాక్టివిటీ లాంటి సమస్యలు పెరిగిపోతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లల భవిష్యత్‌ను కాపాడాలంటే ఇప్పుడు చేతిలో మొబైల్‌ను దూరం పెట్టాల్సిందే!