జ్వరం వచ్చినప్పుడు పిల్లల (Kids Health) శరీర ఉష్ణం పెరుగుతుంది. శక్తి తగ్గిపోతుంది, బలహీనత వస్తుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు అజాగ్రత్తగా ఏ ఆహారమైనా తినిపిస్తే జీర్ణ సమస్యలు, వేడి పెరగడం, జ్వరం మరింత ఎక్కువ కావడం వంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి పిల్లలకు జ్వరం సమయంలో తేలికగా జీర్ణమయ్యే, పోషకాహారమే ఇవ్వాలి. మరి జ్వరం ఉన్నప్పుడు పిల్లలకు ఎలాంటి ఆహరం తీసుకోకూడదు అనే విషయం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మసాలా & నూనె పదార్థాలు
మసాలా ఎక్కువగా ఉన్న వంటకాలు శరీర ఉష్ణాన్ని పెంచుతాయి. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండటంతో అజీర్తి, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశముంది.
పకోడీ, చిప్స్, ఫ్రైడ్ రైస్, నూకలు వేసిన కూరలు, ఎక్కువ తాలింపు వంటకాలు తప్పించాలి.
పాల పదార్థాలు
జ్వరం సమయంలో శరీరంలో శ్లేష్మం (mucus) పెరుగుతుంది. పాలు, పెరుగు, చీజ్ వంటివి ఈ సమస్యను మరింత పెంచుతాయి.
చాక్లెట్ మిల్క్, క్రీమ్, ఐస్‌క్రీమ్, ఫ్లేవర్డ్ యోగర్ట్ ఇవ్వకండి.
చల్లటి పదార్థాలు
చల్లటి ఆహారం గొంతు కట్టిపోవడం, దగ్గు, టోన్సిల్స్ సమస్యలకు దారితీస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.
ఐస్‌క్రీమ్, సోడాలు, శీతల పానీయాలు, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారం వద్దు.
అధిక చక్కెర పదార్థాలు
చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇన్ఫ్లమేషన్ పెరిగి జ్వరం ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది.
కాండీలు, కేకులు, జ్యూస్ కాన్సంట్రేట్స్, పాకంతో చేసిన మిఠాయిలు ఇవ్వకండి.
పచ్చి పదార్థాలు
జ్వరం సమయంలో జీర్ణక్రియ సరిగా పనిచేయదు. పచ్చి పదార్థాలు గ్యాస్, అజీర్తి కలిగించవచ్చు.
పుచ్చకాయ, మోసంబి, నిమ్మ వంటి చల్లదనం ఎక్కువ ఇచ్చే పండ్లు ఎక్కువగా తినిపించకండి.
జ్వరం సమయంలో పిల్లలకు సూప్, కిచిడీ, ఉడికించిన కూరగాయలు, పప్పు రసం వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వడం మంచిది.