Jaggery Tea: బెల్లం టీ తయారీ విధానం మరియు దాని ఆరోగ్య ప్రయోజనాలు

బెల్లం టీ అనేది రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పానీయం. ఇది శరీరానికి వెచ్చదనం ఇచ్చే శక్తివంతమైన డ్రింక్‌ మాత్రమే కాదు, పలు పోషకాలను కూడా అందిస్తుంది. బెల్లంలో ఉండే సహజ ఎంజైమ్‌లు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. అంతేకాదు, ఇది గ్యాస్‌, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తాన్ని శుభ్రపరచడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

బెల్లం టీ తయారీకి కావలసిన పదార్థాలు:

నీరు – 2 కప్పులు

బెల్లం – 2 నుండి 3 చిన్న ముక్కలు

టీ ఆకులు – 1 టీస్పూన్

అల్లం – 1 అంగుళం ముక్క

తులసి ఆకులు – 4-5

దాల్చిన చెక్క – 1 చిన్న ముక్క

పాలు – 1/2 కప్పు (ఐచ్ఛికం)

తయారీ విధానం:

ముందుగా పాన్‌లో 2 కప్పుల నీటిని వేసి మీడియం మంటపై వేడి చేయాలి.

నీటిలో అల్లం, తులసి, దాల్చిన చెక్క వేసి 2-3 నిమిషాలు మరిగించాలి.

తర్వాత టీ ఆకులు వేసి మరి కొద్ది సేపు మరిగించాలి.

ఇప్పుడు బెల్లం ముక్కలు వేసి అవి పూర్తిగా కరిగే వరకు మరిగించాలి.

మీరు మిల్క్ టీ ఇష్టపడితే పాలు వేసి మరో 2 నిమిషాలు మరిగించండి.

చివరగా గ్యాస్ ఆపేసి టీని ఫిల్టర్ చేసి కప్పులో వేసుకోవాలి.

ఇక.. రుచికరమైన, ఆరోగ్యకరమైన బెల్లం టీ సిద్ధం!

బెల్లం టీ ప్రయోజనాలు:

జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది

గ్యాస్‌, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం

రక్తాన్ని శుభ్రపరుస్తుంది, చర్మానికి ప్రకాశం తీసుకొస్తుంది

ఇనుము, మెగ్నీషియం, పుష్కలమైన పోషకాలు అందిస్తాయి

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

గొంతునొప్పి, జలుబు, దగ్గు లాంటి శీతకాల ఇబ్బందులకు ఉపశమనం

బెల్లం నెమ్మదిగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

అల్లం, తులసి వల్ల యాంటీబాక్టీరియల్ లక్షణాలు అందుతాయి

తేలికగా తయారు చేసుకునే ఈ బెల్లం టీని రోజు ఒకసారి తీసుకుంటే శరీరానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply