డేంజర్: ఈ మూడు టిఫిన్లతో గుండెపోటు ముప్పు.. ఆరోగ్యకరమైనవి ఇవే..!

ఇటీవల గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వయసు సంబంధం లేకుండా, జిమ్ చేసేటప్పుడు, డ్యాన్స్ చేస్తూ, డ్రైవ్ చేస్తూ ఉన్నచోటే కొందరు అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. నిపుణుల అభిప్రాయం, నేటి జీవశైలి మరియు ఆహారపు అలవాట్లు గుండెపోటుకు ప్రధాన కారణం. ఎక్కువ నూనె, జంక్ ఫుడ్ తీసుకోవడం మన ఆరోగ్యాన్ని తెలియకుండానే ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అందుకే, డైలీ డైట్‌ను ఆరోగ్యకరంగా ప్లాన్ చేసుకోవడం అవసరం.

గుండె జబ్బులను పెంచే అల్పాహారాలు

1. పూరి
పూరి భారతీయ బ్రేక్‌ఫాస్ట్‌లో అందరికీ ఇష్టమైనది. తల్లులు సింపుల్ గా పిల్లలకు దీన్ని ఇస్తారు. కానీ, డీప్ ఫ్రై చేసే విధానం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండెజబ్బులు లేదా గుండెపోటు ప్రమాదాన్ని కలిగించవచ్చు.

2. మసాలా దోశ
సాధారణ దోస ఆరోగ్యానికి మంచిదే. కానీ, బంగాళాదుంప, చీజ్, వెన్న వంటి యాడెడ్ ఇంగ్రిడియెంట్స్ కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఉదయం ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

3. టీ & బిస్కెట్లు
భారతీయులు ఎక్కువగా ఒక కప్పు టీ, బిస్కెట్లు తీసుకుంటారు. రోజూ ఈ అలవాటు అనేక వ్యాధులకు దారితీస్తుంది. అధిక షుగర్ కంటెంట్ రక్తంలో చక్కర పెరగడానికి కారణమవుతుంది, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

4. బ్రెడ్ & జామ్
బ్రెడ్ జామ్ ఈజీ ఎంపికగా ఉంటుంది, కానీ చక్కెర, శుద్ధి చేసిన పిండి, పామాయిల్ అధికంగా ఉండటంతో గుండె ఆరోగ్యానికి హానికరం.

ఆరోగ్యకరమైన అల్పాహార ఎంపికలు

వైద్యుల సలహా ప్రకారం, ఒక ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు సమతుల్యంగా ఉండాలి.

ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎంపికలు:

ఇడ్లీ

వెజిటబుల్ దాలియా

వెజిటబుల్ ఓట్స్

వెజిటబుల్ పోహా

పనీర్ శాండ్‌విచ్

మల్టీగ్రెయిన్ దాల్ కిచ్డి

ఈ ఎంపికలు గుండె ఆరోగ్యానికి హానికరమైన ఫాస్ట్ ఫుడ్ కన్నా చాలా బెటర్.

Leave a Reply