మనలో చాలా మందికి తెలియని ఓ అందమైన రహస్యం ఉంది. రహస్యం అందంగా ఎలా వుంటుందనేగా మీ సందేహం.. అదేనండి అందాన్ని అందించే ఓ రహస్యం.. ఇంతకీ ఏంటా రహస్యం అంటే.. కీరదోస నీళ్ల రహస్యం.. ! ఇది మన పాత తరం వారికి మాత్రమే తెలిసిన ఓ అద్బుత రహస్యం. సాధారణంగా మనం కీరదోసకాయను చెక్కును తీసి ముక్కలుగా కోసుకుని తింటాం.. కానీ నీళ్లలో వేసి నానబెట్టి ఆ నీటిని తాగే విషయం ఇప్పటి వారికి తెలియక పోవచ్చు. కానీ, ఆ నీళ్లలోనే అసలు సిసలైన ఎన్నో పోషకాలు వున్నాయని మనలో చాలా మందికి తెలియదు. మీకు బెండకాయ నీళ్లతో కలిగే ఎన్నో ప్రయోజనాల గురించి ఓక వీడియో చేశాము. అలాగే కీరదోస నీళ్లు కేవలం మన దాహం తీర్చడమే కాదు, మన శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.
కీరదోసకాయలో 85% నీరు, పైబర్ ఉంటుంది. అందుకే, దీని నీళ్లు మనకి మంచి ప్రయోజనాలను కలిగిస్తాయి. మన శరీరాన్ని తక్షణమే చల్లబరుస్తాయి. ఇక ఇప్పుడు వస్తున్న వేసవిలో వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. అంతేకాదు, కీరదోసకాయలో విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉండటం చేత ఇవి మన శరీరంలోని అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కీరదోసకాయ డైట్ అత్యంత ఉపయోగకరమైనది. నెలరోజుల్లోపే మీరు బరువు తగ్గుతారు. కీరదోస నీళ్లు మీకు మంచి మేలుచేస్తాయి. ఇందులో కేలరీలు చాలా తక్కువ. పైగా, జీర్ణక్రియను మెరుగుపరిచి, కొవ్వును కరిగిస్తాయి.
కీరదోస నీళ్లలోని యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం మృదువుగా, యవ్వనంగా, కాంతి వంతంగా కనిపిస్తుంది. కీరదోస నీళ్లలో ఉండే సిలికా, సల్ఫర్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా తయారవుతుంది. కీరదోస నీళ్లలోని పొటాషియం రక్తపోటును అదుపులో వుంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కె ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఆస్టియో పోరోసిస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. కీరదోస నీళ్లు అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి. పేగులను శుభ్రంగా ఉంచుతాయి. కీరదోస నీళ్లు శరీరంలోని వ్యర్థాలను, విషపదార్థాలను బయటకు పంపిస్తాయి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
కీరదోస నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు పెరుగకుండా నిరోధిస్తాయి. కొబ్బరి నీళ్ల లాగే కీరదోస నీళ్లు మనకు ప్రకృతి ప్రసాదించిన ఓ వరం. వీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో వున్నాయి.. ముఖ్యంగా మహిళలకు మీ అందం రెట్టింపు అవుతుంది. ప్రతి రోజు ఉదయం ఓ గ్లాసుడు కీరదోసకాయ నీళ్లను తాగి చూడండి.. మీ అందం మరింత పెరుగుతుంది అంటున్నారు నాచురోపతి నిపుణులు. అయితే ఆస్త్మా.. జలుబు.. దగ్గు వున్నవారు ఈ నీటిని నిపుణుల సలహాతో మాత్రమే తీసుకోవాలి. మరి ఆలస్యం ఎందుకు..? ఈరోజే కీరదోస నీళ్లను తాగటం ప్రారంభించండి మీ అందాన్ని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి!