ఇంట్లోనే Crispy Chicken Fries.. తింటే మళ్లీ మళ్లీ చేయాల్సిందే!

క్రిస్పీ చికెన్ ఫ్రైస్ రెసిపీ (Crispy Chicken Fries Recipe in Telugu)

కావలసిన పదార్థాలు:

  • చికెన్ స్ట్రిప్స్ – 250 గ్రాములు (boneless, thin strips)
  • కారం – 2 స్పూన్లు
  • వెల్లుల్లి పొడి – 1 టీస్పూన్
  • మిరియాల పొడి – 1/2 టీస్పూన్
  • గరం మసాలా – 1/2 టీస్పూన్
  • ఉప్పు – తగినంత
  • లెమన్ జ్యూస్ – 1 టేబుల్ స్పూన్
  • కార్న్  ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
  • గోధుమ పిండి / మైదా – 2 టేబుల్ స్పూన్లు
  • గుడ్డు – 1 (beaten)
  • బ్రెడ్ క్రంబ్స్ – అవసరమైనంత
  • నూనె – వేపేందుకు

తయారీ విధానం

మారినేట్ చేయడం:

చికెన్ స్ట్రిప్స్‌ను ఒక బౌల్‌లో వేసి అందులో ఉప్పు, మిరియాల పొడి, కారం పొడి,  గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్ వేసి బాగా కలపాలి.
కనీసం 30 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి.

కోటింగ్ కోసం:
మారినేట్ చేసిన చికెన్‌కు మైదా, కార్న్ ఫ్లోర్ వేసి తడిగా ఉండేలా కలపాలి.

గుడ్డు & బ్రెడ్ క్రంబ్స్:
ప్రతి స్ట్రిప్‌ను గుడ్డులో ముంచి, బ్రెడ్ క్రంబ్స్‌లో కోట్ చేయాలి.

తాలింపు:
పాన్‌లో నూనె వేడి చేసి, చికెన్ స్ట్రిప్స్‌ను deep fry చేయాలి – మిడిల్ ఫ్లేమ్‌లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.

సర్వ్ చేయడం:
టిష్యూ పేపర్ మీద వేసి, sauce లేదా మాయోనైజ్‌తో వేడిగా సర్వ్ చేయండి.

Leave a Reply