కిరీటి రెడ్డి – శ్రీలీల జంటగా నటిస్తున్న ‘జూనియర్’ మూవీ నుంచి మాస్ బీట్ సాంగ్ ‘వైరల్ వయ్యారి’ రిలీజ్ అయ్యింది. ఈ పాటలో శ్రీలీల స్టెప్పులు, డాన్స్ ఎనర్జీ, గ్లామర్ అన్నీ కలసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సంగీత దర్శకుడు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఇచ్చిన క్యాచీ బీట్స్ ఈ పాటను మరింత స్పెషల్‌గా మారేశాయి.
‘జూనియర్’ సినిమా ద్వారా ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. జూలై 18న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రమోషన్లు ఇప్పటికే జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విడుదలైన వైరల్ వయ్యారి పాట కొన్ని గంటల్లోనే 1 మిలియన్ పైగా వ్యూస్ సాధించింది.
Massive beats, crazy moves & viral mania on the way#Junior second single #ViralVayyari out today at 5:36 PM
Get ready for the VIRAL CHARTBUSTER OF THE YEAR
A Rockstar @thisisdsp musical#JuniorOnJuly18th @geneliad @kireetiofficial @sreeleela14 pic.twitter.com/y9n6Elyj95
— Leelu (@sreeleela_leelu) July 4, 2025
ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడమే కాక, సింగర్ హరిప్రియతో కలిసి ఆలపించారు కూడా. లిరిక్ రైటర్ కళ్యాణ్ శంకర్ సోషల్ మీడియా టచ్ ఉన్న పదాలతో యువతను ఆకట్టుకునేలా లిరిక్స్ రాశారు. కిరీటి – శ్రీలీల డ్యాన్స్ కాంబినేషన్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీలీల తన హావభావాలు, గ్రేస్‌తో స్క్రీన్‌పై మెరుపులు మెరిపించింది.
రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్రలో నటిస్తోంది. వారాహి చలనచిత్ర బ్యానర్‌పై రజని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ విజువల్స్‌తో ఈ పాటను ఇంకా గ్రాండ్‌గా మలిచారు.
SONG MATRAM 🔥💥
Blockbuster 🥵🎶
DSP Music 🔥💥#ViralVayyari#junior pic.twitter.com/6TDDRDQtbA— కళ్యాణ్ UK (@UdaykumarKalya1) July 4, 2025
‘వైరల్ వయ్యారి’ ఇప్పుడు నిజంగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు!