మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌గా నిలిచిన ‘కింగ్‌డమ్’ మరో 24 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మాస్ అట్రాక్షన్‌ను పెంచాయి.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్మురేపుతున్నాయి. రెండు రోజుల క్రితమే టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. Sacnilk నివేదిక ప్రకారం, ప్రీ-సేల్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ.13 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.5 కోట్లు విదేశీ మార్కెట్ నుంచే వచ్చాయని సమాచారం. ట్రేడ్ నిపుణుల అంచనాల ప్రకారం, ప్రీ సేల్, ప్రీమియర్ షోలు కలిపి సినిమా రూ.18-20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయవచ్చని చెబుతున్నారు.
Every centre has become a part of #Kingdom’s fever 🔥🔥🔥
It’s a BOX OFFICE CELEBRATION with record breaking bookings all over the world 💥💥💥
🎟️ – https://t.co/4rCYFkA5dI#KingdomOnJuly31st @TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse… pic.twitter.com/Om6Oaj9ttH
— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2025
‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయినా, ‘కింగ్‌డమ్’తో ఆయన మళ్లీ సక్సెస్ పొందగలడా? అన్నది ఆసక్తికరంగా మారింది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్, బ్రదర్ సెంటిమెంట్ కలగలిపిన కథను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి స్టైలిష్‌గా తెరకెక్కించారు. నాగవంశీ నిర్మించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
విజయ్ లుక్, యాక్షన్ సీక్వెన్సులు, అనిరుధ్ రవిచంద్రన్ ఇచ్చిన బీజీఎమ్ ట్రైలర్‌కి స్పెషల్ ఆకర్షణగా నిలిచాయి. సినిమా ద్వారా విజయ్‌ని ఓ కొత్త యాంగిల్‌లో చూడబోతున్నాం. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, మహేష్ ఆచంటా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఇప్పటికే ఈ సినిమాను ప్రివ్యూ చేసిన సందీప్ రెడ్డి వంగా, ‘కింగ్‌డమ్’ పక్కా హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. విజయ్ నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడం, జైలు ఎపిసోడ్ యాక్షన్ సీన్ హైలైట్‌గా నిలవడం గురించి ప్రశంసించారు. ‘అర్జున్ రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్‌పై ఆడియన్స్‌లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.