విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘కింగ్డమ్’ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ వాయిస్‌తో వచ్చిన గ్లింప్స్‌కు మంచి స్పందన రాగా, సినిమా మీద హైప్ మరింత పెరిగింది. మే 30న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
ఇప్పుడే విడుదలైన ‘హృదయం లోపల…’ అనే పాట ప్రోమోలో, విజయ్ దేవరకొండ – భాగ్యశ్రీ జంట బీచ్‌లో కనిపిస్తూ, మధ్యలో లిప్ కిస్ సీన్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ సీన్‌ను చూసిన రౌడీ ఫ్యాన్స్ “పాత విజయ్ మళ్ళీ వచ్చాడు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఫుల్ వీడియో సాంగ్ మే 2న రిలీజ్ కాబోతోంది.
ఈ కొత్త ప్రోమో వల్ల ‘కింగ్డమ్’పై మరింత అంచనాలు నెలకొంటున్నాయి. విజయ్ మరోసారి తన రొమాంటిక్ యాంగిల్‌ను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఫ్యాన్స్‌కి ఇది ఒక ట్రీట్‌గా మారింది. మరి, ఈ పాట మొత్తం ఎలా ఉండబోతుందో చూడాలంటే మే 2వరకు వెయిట్ చేయాల్సిందే.