విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన “కింగ్డమ్” మూవీ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. రిలీజ్ అయిన వెంటనే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజే అద్భుతమైన స్పందన లభించింది. ఫస్ట్ డే నుంచే ఓ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయని సినీ వర్గాలు అంటున్నాయి.
అందుతున్న సమాచారం ప్రకారం, కింగ్డమ్ ఇండియాలో తొలి రోజు రూ.7.07 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం షోల ద్వారా ఈ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో అయితే ఇంకా భారీగా కలెక్షన్లు నమోదైనట్లు సమాచారం.
ప్రీ-బుకింగ్స్ విషయంలో కూడా ఈ సినిమా దుమ్ము దులిపేసింది. బుకింగ్ ఓపెనింగ్స్ దశలోనే రూ.11 కోట్ల నుంచి రూ.12 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ ఓపెనింగ్స్‌గా నిలిచింది.
THE BOX OFFICE IS BLEEDING FIRE 🔥🔥#Kingdom has taken over the BOX OFFICE like a STORM with over 11K+ tickets selling every hour on @BookMyShow 💥💥
🎟️ – https://t.co/J25Bu8X4Dd#BoxOfficeBlockbusterKingdom pic.twitter.com/uu3fVQswMH
— Suresh PRO (@SureshPRO_) July 31, 2025
ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్య షేర్ కలెక్షన్లు రాబట్టినట్లు అంచనాలు. అయితే సినిమా లాభాల్లోకి రావాలంటే టోటల్‌గా రూ.108 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది.
BookMyShowలో ఈ సినిమాకు 14.9K ఓట్ల ఆధారంగా 7.8/10 రేటింగ్ వచ్చింది. ఇందులో ఎక్కువ మంది ప్రేక్షకులు విజయ్ నటన, కథనం, దర్శకుడి టేకింగ్‌ను ప్రశంసించారు.
IMDb రేటింగ్ ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే కొన్ని రివ్యూలలో విజయ్ నటన బాగుందని, అయితే కథలో కొంత గ్రిప్ మిస్సయ్యిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు మీడియా రివ్యూలు చూస్తే, సగటున 3/5 రేటింగ్ వచ్చిందని తెలుస్తోంది. ఇందులో విజయ్ పవర్ఫుల్ పాత్రలో ఒదిగిపోయాడని, భావోద్వేగ సన్నివేశాల్లో తాను నటనతో మెప్పించాడని అభిప్రాయాలు వచ్చాయి.
కింగ్డమ్ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం. నిర్మాత నాగవంశీ ఈ సినిమాను దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.