దేవరకొండలో ఈ మార్పు మంచిదేనా..!

Vijay Devarakonda this kind of Nature is help his career

విజయ్ దేవరకొండ అనతికాలంలోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న యాక్టర్. అర్జున్ రెడ్డితో సూపర్ అనిపించుకున్న అతను గీతా గోవిందంతో స్టార్ ఇమేజ్ సంపాదించాడు. తన ఫ్యాన్స్ ముద్దుగా రౌడీ అని పిలిచినా సంబరపడే విజయ్ దేవరకొండ మైక్ అందుకున్నాడు అంటే స్పీచ్ అదరగొట్టేస్తాడు. అయితే వరుస ఫ్లాపులు అతనిలో మార్పులు తెచ్చాయి. ముఖ్యంగా లైగర్ ప్రమోషన్స్ లో ఇండియాని షేక్ చేస్తామని చెప్పిన విజయ్ ఆ సినిమా తర్వాత చాలా అప్సెట్ అయ్యాడు. అందుకే ఇక మీదట తను కాదు తన సినిమాలు మాట్లాడతాయని అంటున్నాడు.

అంతా బాగానే ఉంది కానీ విజయ్ ఇలా సడెన్ గా తన పంథా మార్చడం వెనక రీజన్ ఏంటన్నది ఆలోచిస్తున్నారు అతని ఫ్యాన్స్. సినిమా రిజల్ట్ అన్నది హీరోల చేతుల్లో ఉండదు. మరి అలాంటప్పుడు విజయ్ ఎందుకు అలా నేను మాట్లాడను అనేశాడని అనుకుంటున్నారు. అంతేకాదు దేవరకొండ లో ఒకరకమైన భయాందోళనలు కూడా కనిపిస్తున్నాయి. కెరీర్ లో వరుస ఫ్లాపులు అతని కాన్ ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టాయని తెలుస్తుంది. అయితే అతను ఖుషితో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా అనుకున్న హిట్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ గీతా గోవిందం డైరెక్టర్ పరశురాం తో ఒక సినిమా.. గౌతం తిన్ననూరితో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాల విషయంలో విజయ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

Leave a Reply