విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. అదే ఉత్సాహంతో వరుసగా కొత్త సినిమాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో, వెంకటేష్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ కాంబోపై అధికారిక ప్రకటన విడుదలైంది. ‘వెంకీ-77’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ వేడుకకు వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు (Suresh Babu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభించనుంది.
𝗧𝘄𝗼 𝗼𝗳 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗖𝗶𝗻𝗲𝗺𝗮’𝘀 𝗺𝗼𝘀𝘁 𝗹𝗼𝘃𝗲𝗱 𝗻𝗮𝗺𝗲𝘀 @VenkyMama & #Trivikram unite for a tale to cherish for all time ❤️#Venky77 ~ @haarikahassine Production No. 8 – #VenkateshXTrivikram was launched today with blessings and love from near and dear ones 🪔… pic.twitter.com/NvxQ3pnMPC
— Haarika & Hassine Creations (@haarikahassine) August 15, 2025
నిర్మాత నాగవంశీ ట్విట్టర్‌లో ఫొటోలు షేర్ చేస్తూ – “యా కమాండర్ అండ్ చీఫ్ సెట్స్‌లోకి వచ్చారు. ఎప్పటికీ గుర్తుండిపోయే కథ కోసం వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏకమయ్యారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది” అని రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఇది పక్కా బ్లాక్‌బస్టర్ అవుతుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.