మెగా హీరో వరుణ్ తేజ్ ఇంట శుభవార్త. బుధవారం (సెప్టెంబర్ 10) ఉదయం ఆయన భార్య, నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.
ఈ చిన్నారి, మెగా కుటుంబం కొత్త తరంలో తొలి అబ్బాయి కావడం ప్రత్యేకతగా నిలుస్తోంది. దీంతో మెగా ఫ్యామిలీ అంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.
Mega Family Celebrations!
EXCLUSIVE: #VarunTej & #LavanyaTripathi Blessed with Baby Boy 🥳https://t.co/T6HIxWh2CK
— Pinkvilla (@pinkvilla) September 10, 2025
దాదాపు రెండేళ్ల వివాహ జీవితం తర్వాత వరుణ్, లావణ్య దంపతులు తల్లిదండ్రులుగా మారడం అభిమానులను మరింత సంతోషపరిచింది. సోషల్ మీడియాలో ఈ శుభవార్త వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి తన సినిమా షూటింగ్ మధ్యలోనే సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్-లావణ్య దంపతులను కలిసి అభినందించారు.