Varun Tej-Lavanya Tripathi: తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్, లావణ్య! మెగా అభిమానులకు శుభవార్త..!

మెగా ఫ్యామిలీ నుంచి ఒక శుభవార్త బయటకు వచ్చింది. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో నెలకొన్న ఊహాగానాలకు పుల్ స్టాప్ పెడుతూ, ఈ జంట ఓ ఫోటో షేర్ చేస్తూ.. “జీవితంలో మేము చేపట్టబోతున్న అత్యంత సంతోషకరమైన బాధ్యత ఇది” అంటూ ప్రకటించారు.

ఫోటోతో క్లారిటీ.. అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ
ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ప్రత్యేకమైన ఫోటో పోస్ట్ చేసిన వరుణ్ తేజ్, తాము తల్లిదండ్రులవుతున్నామని తెలియజేశారు. ఈ పోస్టు వైరల్‌గా మారింది. సినీ సెలబ్రిటీలు, అభిమానులు వారి జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. “మెగా వారసుడు రాబోతున్నాడు” అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రేమ కథ నుంచి పెళ్లి వరకూ..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమకథ 2017లో ప్రారంభమైంది. ‘మిస్టర్’ సినిమా సెట్స్‌లో మొదటిసారి కలిసిన ఈ జంట, ఆ తర్వాత ‘అంతరిక్షం’ షూటింగ్ సమయంలో మరింత దగ్గరయ్యింది. వారి ప్రేమ బంధాన్ని చాలా కాలం వరకు గోప్యంగా ఉంచిన ఈ జంట, 2023లో నిశ్చితార్థం ఫోటోలతో అధికారికంగా ప్రకటించారు. అదే ఏడాది నవంబర్ 1న ఇటలీలోని టస్కానీ ప్రాంతంలో జ్ఞాపకాలతో నిండిన వివాహం జరిగింది.

లావణ్య దూరంగా.. వరుణ్ బిజీగా
పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. లావణ్య మాత్రం సినిమాలకు విరామం తీసుకొని కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తోంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.

Leave a Reply