Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య.. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..!

‘బేబీ’ సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్ గా మారిన వైష్ణవి చైతన్య ఇప్పుడు కథల ఎంపికలో ఉన్న సందిగ్ధం వల్ల అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. తన అభినయం, అందంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ తెలుగు అమ్మాయి.. వరుసగా రొటీన్ సినిమాల్లో కనిపించడంతో ఆమెపై వచ్చిన క్రేజ్ కొంతమేర తగ్గుతున్నట్టే అనిపిస్తోంది.

‘లవ్ మీ’, ‘జాక్’ సినిమాల ప్రభావం..!

వైష్ణవి నటించిన ‘లవ్ మీ’ అనే రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ కథాపరంగా బలహీనంగా నిలవడంతో ఆమె పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. సినిమా మీద మంచి అంచనాలు ఉన్నా.. ఆమె పాత్ర కేవలం ఒక గ్లామర్ షాడోలా మిగిలిపోయింది. ఇటీవల వచ్చిన ‘జాక్’ సినిమాలోనూ అదే పరిస్థితి. క్యారెక్టర్ కు ప్రాధాన్యత లేకపోవడం, పాత్ర డెఫినిషన్ లోపించడం వల్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పాత్రల ఎంపిక కీలకం

ఒక్క సినిమా హిట్ కావడం కంటే, ఆ తర్వాత ఎంపిక చేసుకునే కథలే కెరీర్‌ని మలుపు తిప్పగలవు. వైష్ణవి నటనలో టాలెంట్ ఉన్నా.. ఆమె ఎంచుకుంటున్న పాత్రలు ఆ స్థాయిలో ఉండకపోవడం ఆ టాలెంట్‌ని సమర్థంగా ఉపయోగించుకోలేకపోతున్నట్టు ఉంది. యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కథలు, డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ వైపు వెళ్తేనే ఆమె స్థిరమైన విజయాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఫాలోయింగ్‌ ఉన్నా.. ఈ రంగం లో నిలదొక్కుకోవాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. ‘బేబీ’ తరహా సినిమాలు ఆమెను ఒక స్ట్రాంగ్ యాక్టింగ్ ఇమేజ్‌కి తీసుకెళ్తే, ‘లవ్ మీ’, ‘జాక్’ వంటి కథలతో ఆ క్రేజ్‌కి చెడ్డ పేరు తెచ్చే అవకాశముంది. ప్రస్తుతం కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వైష్ణవీ.. కథల ఎంపికలో సరైన నిర్ణయం తీసుకుంటే తన స్థానం నిలబెట్టుకోగలదు.

Leave a Reply