Upasana: పులి పిల్లకు చరణ్ కూతురు పేరు.. ఉపాసన స్పెషల్ పోస్ట్ వైరల్..!

హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో దత్తత తీసుకున్న పులి పిల్లను మెగా కోడలు ఉపాసన మరలా వార్తల్లోకి తీసుకొచ్చారు. తాజాగా తన కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఆ పులి పిల్లను చూసేందుకు వెళ్లిన ఉపాసన, అక్కడ తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

“సరిగ్గా సంవత్సరం క్రితం ఇది ఒక చిన్న పులిపిల్ల. ఇప్పుడు ఆడుకునే ఆడ పులిగా మారింది. ఇప్పుడు ఇది క్లిన్ కారా పేరును పంచుకుంది” అంటూ ఉపాసన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జూ పార్క్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అడవి జంతువులను కేవలం అడవికే చెందాయని భావించకుండా, వాటిని ఆదరిస్తూ గౌరవంగా బతికేలా చేయడం మన బాధ్యత అని ఉపాసన చెప్పారు.

దీంతో ఆ పులి పిల్లకు ‘క్లిన్ కారా’ అనే పేరు పెట్టినట్టు జూ నిర్వాహకులు వెల్లడించారు. దీనికితోడు, పులిపిల్లల సంరక్షణకు అవసరమైన నిధులను మరోసారి జూ అధికారులకు అందజేశారు ఉపాసన. దీంతో ఈ స్పెషల్ పోస్ట్ కి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మెగా ఫ్యామిలీ అభిమానులు, నెటిజన్లు ఉపాసన హృదయాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Leave a Reply