తమిళ స్టార్ హీరో విజయ్‌తో నటి త్రిష ప్రేమలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె పెట్టిన ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. “హ్యాపీ బర్త్‌డే బెస్టెస్ట్” అంటూ త్రిష పెట్టిన క్యాప్షన్‌కు హగ్, ఎవిల్ ఐ ఎమోజీలను కూడా జతచేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
విజయ్ పుట్టినరోజుకి స్పెషల్ పోస్టు
తలపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష చేసిన ఈ పోస్ట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఫోటోలో త్రిష పెంపుడు కుక్క ఇజ్జీతో విజయ్ ఆడుకుంటూ కనిపించగా, పక్కన కూర్చున్న త్రిష విజయ్ వైపు ప్రేమగా చూస్తున్నట్టుగా ఫ్రేమ్‌లో కనిపించింది.
View this post on Instagram
పుకార్లకు మళ్లీ బలం
ఇటీవల త్రిష-విజయ్ ప్రేమలో ఉన్నారన్న పుకార్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతుండగా, ఈ పోస్ట్ ఆ రూమర్లను మళ్లీ బలంగా తెరపైకి తీసుకువచ్చింది. నెటిజన్లు “మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా?” అని నేరుగా ప్రశ్నించగా, మరికొందరు ఇది కేవలం స్నేహం మాత్రమేనని ఖండిస్తున్నారు. మరోవైపు త్రిష తల్లి ఉమా కృష్ణన్ కూడా అదే ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో హార్ట్ ఎమోజీలతో షేర్ చేయడం మరింత చర్చకు దారితీసింది.
విజయ్ భార్య కనిపించకపోవడం కూడా హాట్ టాపిక్
విజయ్ భార్య సంగీత ఇటీవల ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లలో కనిపించకపోవడం కూడా ఈ రూమర్లకు మరింత ఊతమిచ్చిందనే మాట వినిపిస్తోంది. అయితే త్రిష లేదా విజయ్ వీటిపై ఇప్పటికీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
ఘిల్లి నుంచి లియో వరకు.. స్క్రీన్ కెమిస్ట్రీపై అభిమానుల ఫిక్స్
విజయ్, త్రిష కలిసి ‘ఘిల్లి’, ‘తిరుపాచ్చి’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించారు. తెరపై వీరి కెమిస్ట్రీ ఆకట్టుకోవడంతో నిజ జీవితంలోనూ వారి మధ్య సంబంధం ఉందన్న ఊహాగానాలు అప్పటినుంచే షికార్లు చేస్తున్నాయి. తాజాగా వచ్చిన ఈ ‘బెస్టెస్ట్’ పోస్ట్ అయితే ఆ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది.