సౌత్ సినిమాలలో విలన్ పాత్రలతో మెప్పించిన మలయాళ నటుడు టామ్ చాకో డ్రగ్స్ కేసులో చిక్కారు. గతంలో నాని హీరోగా నటించిన ‘దసరా’ మూవీలో కీలక పాత్ర పోషించిన టామ్.. ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. కొచ్చిలోని ఓ హోటల్లో నార్కోటిక్ అధికారులు తనిఖీలు నిర్వహించగా, అతను అనుమానాస్పదంగా కనిపించడంతో విచారణ మొదలైంది. ఈ క్రమంలో ఈరోజు పోలీసులు టామ్‌ను అరెస్టు చేశారు.
ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్లో నాలుగు గంటలపాటు జరిగిన విచారణలో షాక్ ఇచ్చే విషయాలు వెలుగులోకి వచ్చాయి. టామ్‌కు ఓ ప్రముఖ డ్రగ్ డీలర్ సజీర్తో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు తేలింది. అంతేకాదు.. అతడి మొబైల్, వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డులు, గూగుల్ పే ట్రాన్సాక్షన్లను పోలీసులు పరిశీలించగా పలు అనుచిత సమాచారాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో, టామ్ చాకోపై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 27, 29 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
#ShineTomChacko arrested for the second time in 10 years in a similar drug case.🫡
After more than four hours of interrogation, the Kochi City police booked the actor under the Narcotic Drugs and Psychotropic Substances (NDPS) Act Sections 27 and 29.
— What The Fuss (@WhatTheFuss_) April 19, 2025
గురువారం రాత్రి నార్కోటిక్ పోలీసులు కొచ్చిలోని ఓ ప్రముఖ హోటల్లో సడెన్‌గా డ్రగ్స్ రెయిడ్ చేశారు. ఈ సమయంలో హోటల్ మూడో అంతస్తులో ఉన్న టామ్, అధికారులను చూసి మెట్ల ద్వారా పరుగెత్తుతూ అక్కడి నుంచి పారిపోయాడు. అతడి ఈ పరుగు సీసీ టీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. అప్పటి నుంచి అతడు పోలీసుల నిగాలో ఉండగా, చివరకు ఈరోజు విచారణకు హాజరయ్యి అరెస్ట్ అయ్యాడు.
ఇది మొదటిసారి కాదు. గతంలో టామ్ చాకోపై మలయాళ నటి విన్సీ అలోషియస్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో డ్రగ్స్ మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడని, తనను కారవాన్‌లోకి పిలిచి, అక్కడే డ్రెస్ మార్చుకోవాలని బలవంతం చేశాడని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆమె మలయాళ మూవీ అసోసియేషన్ AMMAలో ఫిర్యాదు చేయడంతో టామ్ సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా అసోసియేషన్ ఆలోచిస్తోంది.
డ్రగ్స్ రైడ్.. హోటల్ నుండి దూకి పారిపోయిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో
నటుడు షైన్ టామ్ చాకో కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో రైడ్స్ చేసిన నార్కోటిక్ పోలీసులు
పోలీసులు హోటల్‌కు రావడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో పారిపోయినట్లు ఆరోపణలు
మూడో… pic.twitter.com/06YRlRmNtp
— RTV (@RTVnewsnetwork) April 17, 2025
ఈ వ్యవహారం ఇప్పటికి మలయాళ పరిశ్రమతో పాటు టాలీవుడ్‌లోనూ చర్చకు కారణమవుతోంది. ‘దసరా’ సినిమాతో తెలుగువారికీ పరిచయమైన టామ్ చాకో, డ్రగ్స్ కేసులో అరెస్టవడం సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోసారి డ్రగ్స్ స్కాండల్‌తో సినీ పరిశ్రమ దుమారంలో మునిగిపోగా, ఇలాంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.