Tollywood: టాలీవుడ్‌కు రూ.3700 కోట్ల నష్టం.. కీలక పైరసీ ముఠా సభ్యుడు అరెస్ట్!

టాలీవుడ్‌ పరిశ్రమను పట్టి పీడిస్తున్న సమస్యల్లో పైరసీ ప్రధానమైనది. సినిమాలు విడుదలైన రోజు నుంచే పూర్తిగా నెట్‌లో లీక్ అవుతుండడం, సినీ మేకర్స్‌కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. థియేటర్లలోనే సినిమాను రికార్డు చేసి, పైరసీ మాఫియా చేతికి అమ్మే ముఠాలు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. గేమ్ ఛేంజర్ నుంచి కన్నప్ప వరకూ.. ఇటీవల విడుదలైన పలు సినిమాలు పైరసీ బారిన పడ్డాయి.

తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక కీలక పైరసీ నిందితుడిని అరెస్ట్ చేశారు. సినిమాల పైరసీ వల్ల పరిశ్రమకు భారీ నష్టం కలుగుతోందని, దాదాపు రూ.3700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది.

ఈ కేసులో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆయన సినిమా విడుదలైన రోజే హై క్వాలిటీ HD వర్షన్‌ను లీక్ చేసి, ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అతని మీద 1957 కాపీ రైట్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, మరియు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ అరెస్ట్‌తో మరోసారి పైరసీ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎమర్జెన్సీ లెవెల్‌కు చేరింది.

Leave a Reply