ప్రముఖ హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా (Ester Noronha) 1000 అబద్దాలు అనే తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత సునీల్‌తో కలిసి నటించిన భీమవరం బుల్లోడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, కొంకణి, హిందీ వంటి భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఆమె సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా విజయం సాధించలేకపోవడంతో కెరీర్లో బౌన్స్ బ్యాక్ కావాల్సి వచ్చింది.
ఈ క్రమంలో టాలీవుడ్ సింగర్ నోయెల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎస్తేర్, ఏడాది వ్యవధిలోనే విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆమె పలు చిత్రాల్లో నటించి, రొమాంటిక్ మరియు బోల్డ్ సీన్స్‌తో ఆకట్టుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
View this post on Instagram
ఇటీవల ఎస్తేర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ నెటిజన్లలో హల్చల్ చేస్తోంది. క్రైస్తవ వివాహాల్లో మహిళలు ధరించే తెల్ల గౌను వేసుకుని, పడవలో చేపలతో ఆడుకుంటూ ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. దానికి తోడు, “జీవితంలో మరో అందమైన సంవత్సరానికి భగవంతుడికి కృతజ్ఞతలు. నా పుట్టినరోజు సందర్భంగా నాపై చూపిన ప్రేమకు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. త్వరలోనే ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ వస్తుంది.. వేచి ఉండండి” అంటూ రాసుకొచ్చింది.
ఈ పోస్ట్‌లోని వైట్ గౌను, అనౌన్స్మెంట్ క్లూ చూసి నెటిజన్లు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారని ఊహించి, కామెంట్స్ సెక్షన్లో “కంగ్రాట్స్ ఎస్తర్” అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.