సౌత్ ఇండస్ట్రీలో తాజాగా గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరోయిన్ తాన్య రవిచంద్రన్ ఇప్పుడు ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన తాన్య, తెలుగులో మాత్రం ఎక్కువగా సహాయ పాత్రల్లో కనిపించింది. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ, తన ప్రేమను పబ్లిక్ చేసింది.
View this post on Instagram
సీనియర్ తమిళ్ హీరో రవిచంద్రన్ మనవరాలు అయిన తాన్య 2016లో తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2021లో కార్తికేయ నటించిన రాజా విక్రమార్క సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాలో నయనతార చెల్లెలి పాత్రలో కనిపించింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ తమిళ్‌లోనే బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు.
View this post on Instagram
తన ప్రియుడికి కిస్ ఇస్తూ దిగిన ఫోటోను షేర్ చేసిన తాన్య, కానీ అతడి పేరు లేదా ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. అయితే అదే ఫోటోను సినిమాటోగ్రాఫర్ గౌతమ్ జార్జ్ కూడా షేర్ చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం గౌతమ్ జార్జ్, లారెన్స్ నటిస్తున్న బెంజ్ ప్రాజెక్ట్‌కు కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు.