WAR 2 Teaser: తారక్ బర్త్‌డే స్పెషల్: వార్ 2 క్రేజీ గ్లింప్స్ రిలీజ్-ఎన్టీఆర్ లుక్స్ వైరల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న తొలి సినిమా వార్ 2పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈరోజు తారక్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయడం ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్ట్‌గా మారింది.

గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లతో వచ్చిన వార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్ 2లో హృతిక్‌తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే షూటింగ్ ఎక్కువ భాగం పూర్తి కాగా, తాజాగా విడుదలైన వీడియోలో తారక్ లుక్స్, యాక్షన్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ తొలిసారిగా హిందీ పరిశ్రమలోకి అడుగుపెడుతుండటంతో, అటు టాలీవుడ్ అభిమానులు, ఇటు బాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఎన్టీఆర్ పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉండబోతున్నాయనే ప్రచారం మరింత ఆసక్తి రేపుతోంది.

డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, పవర్ ఫుల్ కాంబినేషన్స్ ఉండబోతున్నాయని సమాచారం. తారక్ పుట్టినరోజున రిలీజ్ చేసిన వీడియోతో థియేటర్లు హంగామా చేసేందుకు సిద్ధమవుతున్నాయనే చెప్పాలి.

Leave a Reply