Ravi Mohan: EMI కట్టలేదని జయం రవి ఇల్లు సీజ్.. బ్యాంక్ వేలానికి సిద్ధం!

తమిళ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ మరోసారి వార్తల్లో నిలిచారు. చెన్నై ఇంజంబక్కంలో ఉన్న ఆయన విలాసవంతమైన బంగ్లాను సీజ్ చేస్తామని బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గత 11 నెలలుగా ఇంటికి సంబంధించిన EMI వాయిదాలు చెల్లించకపోవడంతో, ఇంటి తలుపులకు నోటీసులు అతికించారు.

ఒక స్టార్ హీరో ఇంటిపై ఈ రకమైన చర్య నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రవి మోహన్‌కి నోటీసులు పంపడం ఇదే మొదటిసారి కాదట. దీనికి ముందు కూడా బ్యాంక్ అధికారులు అనేకసార్లు రిమైండర్లు పంపినప్పటికీ ఆయన స్పందించలేదని సమాచారం.

రవి మోహన్ ఈ బంగ్లాను కొనుగోలు చేసే సమయంలో ఒక ప్రైవేట్ బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారని, దానికి సంబంధించిన నెలవారీ వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇంటిపై రూ.7.60 కోట్ల బకాయి ఉందని, గడువు లోపు చెల్లించకపోతే ఇల్లు వేలానికి వేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ఇక మరోవైపు, భార్య ఆర్తితో విడాకుల సమస్యల కారణంగా రవి తన గర్ల్‌ఫ్రెండ్ కేనీషాతో ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో EMI చెల్లింపులు జరగలేదని చెబుతున్నారు. దీంతో ఆయన భార్య, పిల్లలు ఇబ్బందులు పడతారన్న విమర్శలు నెట్టింట్లో వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply