తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్, హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘రెట్రో’ నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్, క్లాస్ కలిపిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. మే 1న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లకు రానుంది.
ఇటీవల సరైన హిట్ లేక అభిమానులను నిరాశపరిచిన సూర్య, ఈసారి మాత్రం ఫుల్ ఫోకస్‌తో రెడీ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించిన పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి, ముఖ్యంగా “బుజ్జమ్మ” సాంగ్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది.
ఈ మూవీలో సూర్యకి జోడీగా గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుండగా, ట్రైలర్‌లో ఆమె పాత్రకు బాగా స్కోప్ ఉన్నట్లు కనిపిస్తోంది. విశేషం ఏంటంటే.. ఇది పూర్తిగా మాస్ యాక్షన్, స్టైల్ మిక్స్ అయిన గ్యాంగ్‌స్టర్ స్టోరీ కావడంతో థియేటర్‌లో మాస్ రెస్పాన్స్ ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి.
గతంలో ‘కంగువ’ ఫలితం ఆశించిన స్థాయికి చేరకపోవడంతో… ఇప్పుడు ‘రెట్రో’తోనే సూర్య మళ్లీ తన మార్క్ చూపించాలనే గట్టిపోరాటంలో ఉన్నాడు. మరి ఈసారి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంటాడా? మే 1న తెలుస్తుంది!