వెంకీ అట్లూరి – సూర్య కాంబోలో తెరకెక్కనున్న “796CC” మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో సూర్యకి జోడీగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ని తీసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఆమెకు స్క్రిప్ట్ వినిపించగా, కీర్తి సానుకూలంగా స్పందించారట. ప్రస్తుతం ఆమె ఈ ప్రాజెక్ట్ పై ఫైనల్ డెసిషన్ తీసుకోనుందని సమాచారం.
“796CC” సినిమాను 80s బ్యాక్‌డ్రాప్‌తో రూపొందించాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ ఇండియాలో మొదటి మారుతి కారును పరిచయం చేసిన సమయంలో ఉండనుందని అంచనా. ఇందులో సూర్య ఒక యంగ్ ఇంజనీర్‌గా కనిపించబోతున్నారు. ‘796CC’ టైటిల్ ఇంకా ఫిక్స్ కావాల్సి ఉంది.
కీర్తి సురేష్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. రీసెంట్ గా వివాహం చేసుకున్న కీర్తి.. కెరీర్ లో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. “మహానటి” సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చాలా మంచి పేరు తెచ్చుకుంది.
సూర్య-కీర్తి సురేష్ కలిసి నటించటం ఇది మొదటిసారి కాదు.. ఎందుకంటే వీరిద్దరు “Thaanaa Serndha Koottam” అనే తమిళ చిత్రంలో కలిసి నటించారు. ఇప్పుడు, వెంకీ అట్లూరి “796CC” సినిమాతో ఈ ఇద్దరి కాంబినేషన్‌ను మరోసారి తెరపై చూపించబోతున్నాడు.
ఇక, ప్రస్తుతం సూర్య “రెట్రో” చిత్రంతో బిజీగా ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 1న విడుదల కానుంది. ఇందులో సూర్య జోడీగా పూజ హెగ్డే నటిస్తున్నారు. “కంగువా” చిత్రంతో నిరాశ చెందిన ఈ సినిమా, ఈసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.