40 ఏళ్ల వయసులో పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపింది కన్నడ నటి భావన రామన్న. ఇది కూడా సాధారణ గర్భధారణ కాదు.. ఆమె కవలలకు తల్లి కాబోతున్నారు. ప్రస్తుతం ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు వెల్లడిస్తూ తన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. భావన IVF పద్ధతిలో గర్భం దాల్చినట్లు వెల్లడించారు.
భావన తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు: “20, 30 ఏళ్ల వయసుల్లో తల్లి కావాలనే ఆలోచన నాకు రాలేదు. కానీ 40 ఏళ్ల వయసులో ఆ కోరిక బలంగా వచ్చింది. అయితే పెళ్లి కాకుండానే తల్లి కావాలంటే ఎంతో మంది సవాళ్లు ఎదురవుతాయి. నా ప్రయత్నంలో కూడా చాలా IVF క్లినిక్స్ నన్ను సింగిల్ అని తిరస్కరించాయి. కానీ డాక్టర్ సుష్మ నాకు అండగా నిలిచి, మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయింది. నా కుటుంబం, తల్లిదండ్రులు కూడా నాకు పూర్తి మద్దతుగా నిలిచారు.”
View this post on Instagram
“నా పిల్లలకు తండ్రి ఉండకపోవచ్చు.. కానీ వాళ్లను ప్రేమ, కళ, సంస్కృతి నిండిన వాతావరణంలో పెంచుతాను. వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాను. తమ మూలాల పట్ల గర్వం కలిగేలా చూసుకుంటాను” అని భావన ఎమోషనల్‌గా చెప్పింది.