Sreeleela: శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నారా? బాలీవుడ్‌లో కొత్త ప్రేమకథ!

టాలీవుడ్‌లో “దమాకా”తో స్టార్‌ హీరోయిన్ మారిన శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన ముద్ర వేస్తోంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ, తెలుగులోనూ, హిందీలోనూ క్రేజ్ పెంచుకుంటోంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.

ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్‌లో ఉన్నట్టుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో చాలా దగ్గరైందని టాక్. మరీ, అది కేవలం ప్రొఫెషనల్ కెమిస్ట్రీనా? లేక వేరే అర్థం ఉందా?

ఈ గాసిప్‌కు మరింత ఊపందించిన ఘటన – కార్తీక్ ఇంట్లో జరిగిన ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల హాజరవడం. ఈ పార్టీలో ఇద్దరూ చాలా సన్నిహితంగా వ్యవహరించినట్లు అక్కడి వారు చెబుతున్నారు. ఇక ఐఫా అవార్డుల వేడుకలో కార్తీక్ తల్లి చేసిన కామెంట్స్‌తో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. కరణ్ జోహర్, “మీకు ఎలాంటి కోడలు కావాలి?” అని ప్రశ్నించగా, ఆమె “డాక్టర్ కోడలు కావాలి” అని సమాధానం ఇచ్చారు. కట్ చేస్తే, శ్రీలీల డాక్టర్ కోర్సు పూర్తి చేసిందన్న విషయం మరింత సంచలనాన్ని రేపుతోంది.

అంతేకాదు, ఇటీవల ముంబైలో జరిగిన పలు మూవీ ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీల్లో కార్తీక్-శ్రీలీల కలిసి కనిపించారట. ఈ జంట మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి, అభిమానులు వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని నమ్ముతున్నారు. ఇక వీరిద్దరి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒకరి పోస్టులకు మరొకరు లైక్‌లు, కామెంట్లు పెడుతుండటం కూడా అభిమానులకు మంచి కిక్కిస్తోంది.

అసలు వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందా? లేక ఇది కేవలం ప్రచారమా? అన్నది ఇంకా స్పష్టత లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలో ఈ జంట గురించి మరిన్ని వివరాలు బయటకు వస్తాయేమో చూడాలి!

Leave a Reply