దుబాయ్‌లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA 2025) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 13వ సైమా వేడుకలో మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్రాలకు అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో తెలుగులో పుష్ప-2, కల్కి 2898 ఏడీ సినిమాలు దాదాపు అన్ని విభాగాల్లో దుమ్మురేపాయి.
బాలీవుడ్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఎంత ముఖ్యమో, సౌత్ సినిమాలకు సైమా అవార్డులు అంతే ప్రతిష్టాత్మకమైనవి. ప్రతి సంవత్సరం జరిగే ఈ సినీ పండుగలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌లు, టెక్నీషియన్లు పాల్గొంటారు. ఈసారి దుబాయ్ వేదికగా జరిగిన సైమా 2025లో 2024లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లను సత్కరించారు.
Pushpa Raj, @alluarjun and his award after the big win at SIIMA – 2025
🗓 5th & 6th September
📍 Dubai Exhibition Centre, EXPO City
🎟 Book Now at https://t.co/gAde88owiI
Dubai Local Partner: #truckersuae#NEXASIIMA #SIIMAinDubai #SIIMA2025 #NEXA #Airtel #Swastiks #HonerHomes… pic.twitter.com/XTo44kXbQQ— SIIMA (@siima) September 5, 2025
తెలుగు విభాగంలో కల్కి 2898 ఏడీ ఉత్తమ చిత్రంగా నిలవగా, పుష్ప-2తో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, రష్మిక ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్నారు. అదే సినిమాలో సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ మరోసారి అవార్డును సొంతం చేసుకున్నారు.
The spotlight’s on, the energy’s high, and the performances are electrifying! #SIIMA2025 is delivering pure entertainment all night long!
🗓 5th & 6th September
📍 Dubai Exhibition Centre, EXPO City
🎟 Book Now at https://t.co/gAde88owiI
Dubai Local Partner: #Truckersuae… pic.twitter.com/QirPCVXtJK— SIIMA (@siima) September 5, 2025
సైమా 2025 తెలుగు విభాగం విజేతల జాబితా:
ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప-2)
ఉత్తమ నటి: రష్మిక (పుష్ప-2)
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప-2)
ఉత్తమ విలన్: కమల్ హాసన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ హాస్య నటుడు: సత్య (మత్తు వదలరా 2)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప-2)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: రత్నవేలు (దేవర)
ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే)
ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావ్ (చుట్టమల్లే)
ఉత్తమ పరిచయ నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
ఉత్తమ నూతన నిర్మాత: నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా (హనుమాన్)
ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హనుమాన్)
ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా: అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్)