ఓ సినిమా ఫ్లాప్ అయితే, దాని బాధ్యతను హీరోలు తీసుకోవడం మామూలుగా జరిగే విషయం కాదు. కానీ కొందరు మాత్రం నిర్మాతలపై భారం పడకుండా మనసు పెడతారు. అలాంటి వారిలోకి తాజాగా చేరాడు డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ.
సిద్ధూ నటించిన తాజా చిత్రం జాక్ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఈ సినిమా ఫలితం నిర్మాతకు నష్టం తీసుకురావడంతో, సిద్ధూ తన రెమ్యునరేషన్‌లో సగం మొత్తం అయిన రూ.4 కోట్లు తిరిగి ఇచ్చేశారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి సిద్ధూ మొత్తం రూ.8 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ చర్యకు సినీ వర్గాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమా ఫలితాన్ని అంగీకరించి, నిర్మాత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించిన సిద్ధూకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
జాక్ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్పై-కామెడీ జానర్‌లో రూపొందింది. సిద్ధూ జొన్నలగడ్డ – వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలై ఆశించిన విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.