స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ ‘జాక్’ ట్రైలర్ ఈరోజు విడుదలై వైరల్ అవుతోంది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఫన్, డ్రామా, సస్పెన్స్, లవ్ వంటి మిక్స్‌డ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, ట్రైలర్‌లో సెన్సార్ లేకుండా బూతులు నేరుగా వాడడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, సిద్దూ జొన్నలగడ్డ-వైష్ణవి చైతన్య జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ సిద్దూ వైష్ణవి మధ్య రొమాన్స్, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, కామెడీ, డ్రామా వంటి అంశాలతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సిద్దూ-నరేష్ తండ్రీకొడుకుల పాత్రల్లో వచ్చే కామెడీ సీన్స్ బాగా పేలాయి.
ట్రైలర్ చూస్తుంటే సిద్దూ ఓ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల అంచనా ప్రకారం, ఇదొక డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కానుంది.
#jack trailer bagundhi 😂💥
But 10gey word intha normalise chesesaru nti movies lo10gey
Munda koduku
L&$ko$kuSoon movies lo boothulu inka ekvvua use chesi normalise chesela unnaru
— Praꪜeenu 🎶 (@Praveen_9_99) April 3, 2025
అయితే, ట్రైలర్‌లో కొన్ని సున్నితమైన బూతు డైలాగులు నేరుగా వాడడం ప్రేక్షకుల్లో మిక్స్‌డ్ రియాక్షన్స్‌ను తీసుకువచ్చింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, సెన్సార్ బోర్డు ఏమైపోయిందో? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, ఫైనల్ కట్‌లో వీటిని బీప్ చేసే అవకాశముంది.
ఇప్పటికే విడుదలైన ‘కిస్’ సాంగ్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. BVSN ప్రసాద్ & బాపినీడు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల
కానుంది.
ట్రైలర్‌లో వచ్చిన బూతులు సినిమాపై ప్రభావం చూపిస్తాయా? లేక ఇది కేవలం ప్రమోషన్ ట్రిక్ మాత్రమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో చెప్పండి!