మలయాళ నటి శ్వేతా మీనన్‌కి చేదు అనుభవం ఎదురైంది. అసభ్యకర కంటెంట్‌తో కూడిన సినిమాలు, ప్రకటనల్లో నటిస్తూ ఆర్థిక లాభం పొందుతున్నారన్న ఆరోపణలతో ఆమెపై కొచ్చి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కొచ్చికి చెందిన సామాజిక కార్యకర్త మార్టిన్ మేనచెరి చేసిన ఫిర్యాదుపై ఎర్నాకులం కోర్టు ఆదేశాలతో ఈ కేసు నమోదైంది.
ఈ కేసులో శ్వేతా నటించిన ‘రతి నిర్వేదం’, ‘పలేరి మాణిక్యం’, ‘కాళిమన్ను’ వంటి సినిమాల్లోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలతో పాటు ఆమె చేసిన కండోమ్ ప్రకటనను ప్రస్తావించారు. ఆమె డబ్బు కోసం అశ్లీల చిత్రాల్లో నటిస్తూ, ఆ కంటెంట్‌ను సోషల్ మీడియాలో, అడల్ట్ వెబ్‌సైట్లలో ప్రచారం చేస్తున్నారన్నది ఫిర్యాదుదారుడి వాదన. ఇప్పటికే పోలీసులు ఈ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించారు.
Kerala | Kochi Police registered an FIR against actor Shwetha Menon under relevant sections of the Immoral Traffic (Prevention ) Act 1956 and the Information Technology Act, 2000. The FIR was registered on a complaint by social activist Martin Menachery: Kochi Police (06/08)
— ANI (@ANI) August 6, 2025
ఇదిలా ఉండగా, శ్వేతా మీనన్ ప్రస్తుతం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమవుతుండటం, అదే సమయంలో ఈ కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. చాలా సంవత్సరాల క్రితంనాటి చిత్రాల ఆధారంగా ఇప్పుడు కేసు నమోదు చేయడం వెనుక రాజకీయ దుమారం దాగి ఉండొచ్చని అనేక ఊహాగానాలు వస్తున్నాయి.
శ్వేతా మీనన్ సినీ ప్రస్థానాన్ని చూస్తే.. ఆమె మోడల్‌గా కెరీర్ ప్రారంభించి 1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ గెలుచుకున్నారు. అదే ఏడాది మిస్ ఇండియా పోటీల్లో మూడవ రన్నరప్‌గా నిలిచారు. 1991లో మలయాళ సినిమా ‘అనస్వర’తో నటిగా తెరంగేట్రం చేసిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా ‘ఇష్క్’, ‘బంధన్’, ‘హంగామా’ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన ‘రాజన్న’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. ‘కాళిమన్ను’ సినిమాలో ఆమె నిజమైన ప్రసవ సన్నివేశాన్ని చిత్రీకరించగా, అది అప్పట్లో పెద్ద దుమారం రేపింది. కానీ శ్వేతా మాత్రం తన నటనకు అంకితంగా చేసిన పని అని వెల్లడించారు.
2011లో శ్వేతా మీనన్, శ్రీవల్సన్ మీనన్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఒక కుమార్తె ఉంది.