డ్రగ్స్ మత్తులో నన్ను ఇబ్బంది పెట్టాడు.. ‘దసరా’ విలన్‌పై షాకింగ్ ఆరోపణలు

తాజాగా మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఒక షాకింగ్ అనుభవాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. గతంలో ఓ సినిమాలో భాగంగా షూటింగ్ జరుగుతుండగా, ప్రముఖ నటుడు తనపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె వెల్లడించింది. అతడి పేరు స్పష్టంగా చెప్పకపోయినా, కథనాల ప్రకారం ఈ వ్యవహారం ‘దసరా’ సినిమాతో టాలీవుడ్‌కి వచ్చిన విలన్ షైన్ టామ్ చాకో అని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

షైన్ టామ్ చాకో ఇప్పటికే డ్రగ్స్‌ కేసులో ఇరుక్కునాడు. ఈ విషయం వెలుగు చూసిన తర్వాతే విన్సీ గత అనుభవాన్ని బయటపెట్టింది. ఆమె మాటల్లో, ‘‘ఒక సినిమా సెట్లో నటుడు బహిరంగంగా డ్రగ్స్ తీసుకున్నాడు. నన్ను ఫిజికల్‌గా ఇబ్బంది పెట్టాడు. నేను భయంతో అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది,’’ అని పేర్కొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by vincy_sony_aloshious (@iam_win.c)

విన్సీ మాట్లాడుతూ, ‘‘డ్రగ్స్ వాడే నటులతో పని చేయను. ఆ అనుభవం నన్ను ఎంతో బాధించింది. ఆ సమయంలో చుట్టుపక్కల వారు ఊరకే చూశారు. ఎవరూ స్పందించలేదు,’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నెటిజన్లు ఆమెకి మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు, షైన్ టామ్ చాకోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి.

ఈ ఆరోపణలపై పోలీసుల స్పందన కూడా ఆసక్తికరంగా మారింది. ఫిర్యాదు వస్తే విచారణ ప్రారంభిస్తామని వారు స్పష్టం చేశారు. అంతేకాదు, డ్రగ్స్ వినియోగంపై ఇప్పటికే ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, షైన్ కెరీర్‌పై పెద్ద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఇప్పటికే ‘దసరా’, ‘రంగబలి’, ‘దేవర’ ‘దాకు మహారాజ్’ వంటి సినిమాల్లో నటించిన షైన్ టామ్ చాకోపై ఇలా ఆరోపణలు రావడం అతని క్రియాశీలతపై ప్రశ్నలు తలెత్తిస్తోంది. విన్సీ చెప్పిన వివరాలు, ఆమె పోస్ట్ చేసిన వీడియోలు, సినీ ఇండస్ట్రీలో మాదకద్రవ్యాల వాడకంపై మళ్లీ చర్చను తెరపైకి తెచ్చాయి.

Leave a Reply