నటి సమంత తాజాగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారి మధ్య డేటింగ్ పుకార్లు ఇప్పటికే నెట్టింట చర్చకు హాట్ టాపిక్ అయిపోగా, ఇప్పుడు ఇద్దరూ కలిసి తిరుపతిలో కనిపించడంతో పెళ్లి ముహూర్తం ఫిక్సయ్యిందా? అన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
సమంత తన స్వంత బ్యానర్ ట్రాలాలా ప్రొడక్షన్స్ ద్వారా నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె మూవీ టీమ్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగించిన అంశం.. రాజ్ నిడిమోరు కూడా ఆమెతోపాటుగా దర్శనానికి రావడం. ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో ఆలయ ప్రాంగణంలో కనిపించడంతో, ఇది కేవలం సినిమా ప్రమోషన్ల కోసమేనా? లేక వ్యక్తిగత నిర్ణయం వెనుక ఉన్నదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
திருப்பதியில் நடிகை சமந்தா.. தனது தயாரிப்பில் வெளியாகும் முதல் படமான சுபம் திரைப்பட குழுவுடன் சாமி தரிசனம்..!#Tirupati | #Tirumala | #Temple | #ActressSamantha | #PolimerNews pic.twitter.com/EfP2AD79Mz
— Polimer News (@polimernews) April 19, 2025
గత కొద్ది నెలలుగా సమంత-రాజ్ మధ్య డేటింగ్ పుకార్లు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ తిరుపతిలో ఒకే ఫ్రేమ్‌లో దర్శనమివ్వడం ఆ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.
సమంత అభిమానులు మాత్రం ఇది కేవలం ప్రొఫెషనల్ ప్రయాణమే అని చెబుతున్నారు. కానీ గతంలో ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి ప్రాజెక్టులలో కలిసి పనిచేసిన ఈ కాంబో ఇప్పుడు మరో సిరీస్ ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ కోసం మళ్లీ కలవబోతున్నారు.
View this post on Instagram
ఇద్దరూ వ్యక్తిగతంగా కూడా కలుస్తున్నారన్న వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కానీ తిరుపతిలో ఇద్దరు కలిసి దర్శనం ఇవ్వడం వెనుక నిజంగా పెళ్లి ముహూర్తమే ఉందా? అనేది మాత్రం ప్రేక్షకుల అనుమానాలకు తావిస్తోంది.