స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీసింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న క్షణాల్లో, ఆమె పోస్టు చేసిన సందేశం వివాదాస్పదంగా మారింది. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో అమాయక పర్యాటకుల ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్వేగాన్ని రేకెత్తించగా, భారత్ పాకిస్థాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు అందించే సింధు జలాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇలాంటి సున్నితమైన సమయంలో, సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక భావోద్వేగపూరిత మెసేజ్‌ను షేర్ చేసింది. ఆమె పోస్ట్‌లో ఇలా పేర్కొంది “సముద్రాలు తమ నీటిని తాగలేవు, చెట్లు తమ పండ్లు తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు. ప్రకృతి ఇతరుల కోసం జీవిస్తుంది. మనమూ ఒకరికి ఒకరం సహాయం చేసేందుకు పుట్టాము. నీ కోసం జీవిస్తే ఆనందం, అందరి కోసం జీవిస్తే నిజమైన ఆనందం.”
ఈ కోట్‌ను సమంత పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యగా పేర్కొన్నారు. అయితే ఈ సందేశం దేశభక్తి భావోద్వేగాలు ఉప్పొంగుతున్న సమయానికి విరుద్ధంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇది పరోక్షంగా పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నట్టు ఉందని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
పాకిస్థాన్‌కు మద్దతుగా సమంత పోస్ట్..?#Samantha #SamanthaRuthPrabhu #IndusWaterTreaty #Pakistan #India #Oneindiatelugu pic.twitter.com/xjLTQG4oDP
— oneindiatelugu (@oneindiatelugu) April 25, 2025
సమంత పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఆమెపై విమర్శలు మొదలవడంతో, సమంత వెంటనే తన పోస్ట్‌ను తొలగించారు. అయితే ఆమె ఏ ఉద్దేశ్యంతో ఆ పోస్ట్ చేశారు? దాన్ని ఇప్పుడు డిలీట్ చేయడంలో అసలు కారణం ఏమిటి? అనే సందేహాలు మిగిలిపోయాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దేశభక్తి మిన్నంటుతుండగా, ఇలాంటి సందేశాలను ప్రజలు సానుకూలంగా చూడటం లేదు. ముఖ్యంగా, పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్థాన్‌పై ఆగ్రహం తారాస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో సమంత వంటి సెలబ్రిటీలు జాగ్రత్తగా స్పందించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు చెబుతున్నారు.
సమంత తన పోస్ట్ గురించి ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆమె వివరణ ఇవ్వాలన్న డిమాండ్ నెటిజన్లలో పెరుగుతోంది. అయితే ఈ వివాదం ఆమెపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి. ఒకవేళ సమంత త్వరలో క్లారిటీ ఇస్తే, ఈ వివాదం కొంతమేర తగ్గే అవకాశం ఉంది.