Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరీ గ్లామర్ రచ్చ.. సైమా రెడ్‌కార్పెట్ పై అదిరిపోయిన లుక్!

దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ 2025 ఉత్సవంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినీ తారలు హాజరై వేడుకను మరింత వైభవంగా మార్చారు. 2024లో సౌత్ ఇండస్ట్రీలో ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లు ఈ అవార్డులను అందుకున్నారు.

ఈ వేడుకలో పుష్ప 2 మరియు కల్కి 2898 AD సినిమాలు అవార్డుల వర్షం కురిపించాయి. కల్కి ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా, దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు.

సైమా స్టేజీపై మీనాక్షి మెరిసింది

తెలుగు ఇండస్ట్రీ నుంచి మీనాక్షి చౌదరీ కూడా అవార్డు అందుకోవడంతో పాటు ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె ధరించిన డిజైనర్ బాడీకాన్ గౌన్ నెట్టింట వైరల్ అవుతోంది. స్టన్నింగ్ లుక్స్‌తో రెడ్‌కార్పెట్‌పై మెరిసిన మీనాక్షి, ఫ్యాషన్ సెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంది.

ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ, నెటిజన్లు “స్టన్నింగ్”, “హాట్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓ అభిమాని అయితే, “మేడం సార్.. మేడం అంతే” అంటూ ఫైర్ ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు.

Leave a Reply