Saiyaara Collections: రికార్డులు బద్దలు కొడుతున్న ‘సయ్యారా’.. వసూళ్లలో సునామీ!

లేటెస్ట్ సెన్సేషన్ అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా ‘సయ్యారా’ విడుదలైన మొదటి వారం నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఎనిమిదవ రోజు వరకు రూ.18 కోట్లు వసూలు చేయగా, మొత్తం ఇండియా నెట్ కలెక్షన్ ఇప్పుడు రూ.190.75 కోట్లకు చేరింది.

ఇప్పటికే ‘సయ్యారా’, అక్షయ్ కుమార్ నటించిన ‘హౌస్‌ఫుల్ 5’ (రూ.183 కోట్లు), అజయ్ దేవ్‌గన్ ‘రైడ్ 2’ (రూ.173 కోట్లు) లాంటి సినిమాల లైఫ్‌టైమ్ కలెక్షన్లను దాటి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

శనివారానికి రూ.200 కోట్ల క్లబ్‌లో..
ఈ శుక్రవారం కూడా ఎలాంటి హిందీ సినిమా విడుదల కాకపోవడంతో, ‘సయ్యారా’ కి వసూళ్ల పరంగా ఎలాంటి పోటీ లేదు. దీంతో శనివారానికే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఇది 2025లో విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ తర్వాత ఆ ఘనత సాధించిన రెండవ బాలీవుడ్ చిత్రంగా నిలవనుంది.

ప్రేమకథలో కొత్త మేజిక్
కథ పరంగా చూస్తే, సినిమా క్రిష్ కపూర్ (Ahaan Panday) అనే యువ సంగీతకారుడు, వాణీ బత్రా (Aneet Padda) అనే రచయిత మధ్య ప్రేమను అద్భుతంగా చూపించారు. లవ్, ఎమోషన్స్, బ్రేక్ అప్ సీన్లను డైరెక్టర్ మోహిత్ సూరి తనదైన స్టైల్‌లో తెరకెక్కించారు.

‘సయ్యారా’ ఆగస్టు 1న విడుదలవనున్న ‘ధడక్ 2’ వరకు థియేటర్లలో విజయవంతంగా కొనసాగే అవకాశం ఉంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ హిట్‌గా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

Leave a Reply