Mirai Review-RGV: ‘మిరాయ్’ సినిమాపై ఆర్జీవీ మైండ్ బ్లోయింగ్ ట్వీట్.. హాలీవుడ్ రేంజ్ అంటూ..

యంగ్ హీరో తేజా సజ్జా నటించిన మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘మిరాయ్’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ, ప్రేక్షకుల నుండి సూపర్, బ్లాక్ బస్టర్ రివ్యూలు అందుకుంటోంది. యాక్షన్, ఎలివేషన్స్, డివోషన్, ఎమోషన్ అన్నీ కలగలిపిన మిరాయ్ సినిమాపై సోషల్ మీడియాలో హంగామా నడుస్తోంది.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) కూడా ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.

ఆర్జీవీ ట్వీట్:
‘‘ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు తేజా సజ్జా, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనికి బిగ్ షౌటౌట్! బాహుబలి తర్వాత వచ్చిన మరే ఇతర చిత్రానికి ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ నేను వినలేదు. సినిమా కథనం, వీఎఫ్ఎక్స్ రెండూ కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్ కలిగి ఉన్నాయి’’ అంటూ ఆర్జీవీ తన ట్వీట్‌లో రాశారు.

అలాగే ఆయన, రాజమౌళి బాహుబలి తర్వాత అందరినీ ఇంత రేంజ్‌లో మెప్పించిన సినిమా మిరాయ్ అని ప్రశంసించారు.

Leave a Reply