Rashmika, Vijay: మరోసారి అడ్డంగా దొరికిపోయిన విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న..!

టాలీవుడ్ హాట్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ‘గీత గోవిందం’ సినిమాతో మొదలైన వీరి కెమిస్ట్రీ, ‘డియర్ కామ్రేడ్’లో మరింతగా ఆకర్షించింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య గాఢమైన బంధం కొనసాగుతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇప్పటికే వీరి డేటింగ్‌ను సూచించే పలు క్లూ‌లు బయటకొచ్చాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఒకరి తర్వాత మరొకరు కనిపించడం, ఒకే సమయంలో మాల్దీవుల్లో వీరిద్దరూ ఉండడం వంటి సంఘటనలు వీరి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరిచాయి. వీటిపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా, ఈ రూమర్లు తగ్గట్లేదు.

ఒకానొక సందర్భంలో, విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ వేర్వేరుగా తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఆ ఫొటోల బ్యాక్‌గ్రౌండ్ సేమ్ టు సేమ్ ఉండటంతో వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు.

ఇటీవల ముంబైలో ఓ రెస్టారెంట్‌లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి భోజనం చేస్తూ కనిపించారు. మొదట రష్మిక రెస్టారెంట్‌లోకి వెళ్లగా, కొద్దిసేపటి తర్వాత విజయ్ దేవరకొండ మాస్క్, టోపీ ధరించి, ఎవరికీ గుర్తుపడకుండా వెనుక ద్వారం నుంచి వచ్చాడు. అయితే, పాపం వీరి ప్లాన్ ఫలించలేదు! అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లు వీరిద్దరినీ కెమెరాలో బంధించడంతో అసలు విషయం బయటపడింది.

ఈ ఘటనతో మరోసారి వీరి రిలేషన్‌షిప్‌పై వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ కొత్త సినిమాపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో, వీరి మధ్య అనుబంధంపై మరింత చర్చ మొదలైంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో వీరి ఫొటోలు ట్రెండ్ అవుతుండగా, అభిమానులు ‘ఇదే నిజమైతే త్వరగా ఎనౌన్స్ చేయండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి, ఈ జంట ప్రేమ విషయాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి!

Leave a Reply