Mysaa: ‘విజ్జూ మాటిస్తున్నా.. నిన్ను గర్వపడేలా చేస్తా’.. రష్మిక హార్ట్ టచింగ్ ప్రామిస్!

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా జంట మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరి మధ్య జరిగిన ఓ చిన్న సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాలో రష్మిక కొత్త సినిమా ‘మైసా’ ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తూ – ‘ఇది అద్భుతంగా ఉండనుంది’ అని కామెంట్ చేశాడు. దీనిపై రష్మిక స్పందిస్తూ – ‘విజ్జూ, ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తాను’ అంటూ హార్ట్ ఎమోజీ జత చేసింది. ఈ పోస్టు ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

విజయ్, రష్మికలు గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య రొమాంటిక్ రిలేషన్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు వారు తమ రిలేషన్‌షిప్‌ను పబ్లిక్‌గా ప్రకటించలేదు.

అయితే ఇద్దరూ తరచూ కలిసే కనిపించడం, ఫ్యామిలీ టూర్లకు కలిసి వెళ్లడం, సామాజిక మాధ్యమాల్లో వారి ఫొటోలు వైరల్ కావడం చూస్తే ఈ వార్తలకి బలం చేకూరుతోంది. తాజా పోస్టు విషయంలో రష్మిక విజయ్‌ను ‘విజ్జూ’ అని పిలవడం, ప్రేమతో స్పందించడాన్ని చూసి ఫ్యాన్స్ ఈ జంట నిజంగానే రిలేషన్‌లో ఉన్నారని గట్టిగా నమ్ముతున్నారు.

ఇక రష్మిక నటిస్తున్న ‘మైసా’ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఖడ్గం పట్టుకుని, ముఖం నిండా రక్తంతో ఓ యోధురాలా కనిపించిన రష్మిక లుక్‌కు సోషల్ మీడియాలో అభినందనలతో నిండిపోయింది. ఈ పవర్‌ఫుల్ లుక్‌పై విజయ్ చేసిన కామెంట్స్, రష్మిక ఇచ్చిన రిప్లై అభిమానుల హృదయాలను తాకుతోంది.

Leave a Reply