Ramayana Glimpse: ‘రామాయణ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. అదిరిపోయిన రామ్, రావణ లుక్స్..!

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మైథలాజికల్ మూవీకి సంబంధించి తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కేజీఎఫ్ ఫేమ్ యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు.

ఫస్ట్ గ్లింప్స్‌లో రాముడిగా రణ్‌బీర్, రావణుడిగా యశ్ లుక్ అదిరిపోయింది. విజువల్స్ గ్రాండ్‌గా ఉండగా.. మేకింగ్‌కు సంబంధించిన స్టాండర్డ్ స్పష్టంగా కనిపిస్తోంది. “ఈ ప్రపంచాన్ని సృష్టించేది బ్రహ్మ.. రక్షించేది విష్ణువు.. అంతం చేసేది శివుడు” అనే డైలాగ్‌తో గ్లింప్స్‌కు ఓ పవర్‌ఫుల్ టచ్ ఇచ్చారు.

ఈ సినిమాలో లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీతాన్ని ప్రముఖ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్‌తో పాటు భారతీయ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.

ఈ రామాయణం రెండు భాగాలుగా రూపొందుతోంది. దీని మొదటి పార్ట్‌ 2026 దీపావళికి థియేటర్లలో విడుదల కానుందని చిత్రయూనిట్ ప్రకటించింది.

Leave a Reply