రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ తేదీ ఫిక్స్.. లండన్ నుంచి సింగపూర్ వరకు చరణ్ క్రేజ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం సిద్ధమైంది. లండన్‌లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మే 9న దీనిని లాంచ్ చేయనున్నారు. ఆవిష్కరణ అనంతరం, ఈ విగ్రహాన్ని శాశ్వతంగా సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలించనున్నారు.

‘మగధీర’ సినిమాతో స్టార్ హీరోగా నిలిచిన రామ్ చరణ్, ‘RRR’ ద్వారా గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. మాస్ యాక్టింగ్, ఎనర్జిటిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. చరణ్ మైనపు విగ్రహం లాంఛనీయంగా ఆవిష్కరించబడుతున్న సంగతి అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

ఈ మైనపు విగ్రహాన్ని రూపొందించడంలో చరణ్‌తో పాటు అతని పెట్ డాగ్ ‘రైమ్’ వివరాలను కూడా ప్రాముఖ్యంగా చేర్చారు. కొలతలు, ఫోటోలు, వీడియోలు తీసి అత్యంత ప్రతిష్టాత్మకంగా మోడలింగ్ చేశారు.

ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి టాలీవుడ్ ప్రముఖుల విగ్రహాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ ఈ గౌరవాన్ని అందుకోవడం తెలుగు పరిశ్రమకు మరో గర్వకారణం.

సినీ ప్రాజెక్టుల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్, దివ్యేందు, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఈ మూవీ 2026 మార్చి 27న విడుదల కానుంది.

Leave a Reply