మెగా ఫ్యామిలీకి షాక్.. రామ్ చరణ్ సినిమాకు నో చెప్పిన మలయాళ నటి..!

టాలీవుడ్‌లో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు.

ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా, వెంకట సతీష్ 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

అయితే, ఈ సినిమాలో రామ్ చరణ్ తల్లి పాత్ర కోసం సంప్రదించిన మలయాళ నటి స్వాసిక ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. స్వాసిక స్వయంగా ఒక వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఆమె మాటల్లో.. “రామ్ చరణ్ వయసు 40 సంవత్సరాలు కాగా, నా వయసు 33 సంవత్సరాలే. వయసు తేడా సమస్య కావడంతో ఆ పాత్రను తిరస్కరించాను. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామని చెప్పినా కూడా ఆ పాత్ర చేయలేదు” అని చెప్పింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, మెగా ఫ్యామిలీ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply