గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఆయన మరియు ఉపాసన ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక బహుమతిని దర్శకుడు బుచ్చిబాబుకు పంపించడమే కాదు… ఆ గిఫ్ట్‌లో ఉన్న భావోద్వేగం బుచ్చిబాబును ఎమోషనల్ చేసింది.
బుచ్చిబాబు తన సోషల్ మీడియా వేదికగా ఆ గిఫ్ట్ ఫోటోలను షేర్ చేస్తూ.. “మీ ప్రేమను ఈ బహుమతి తెలియజేస్తుంది” అంటూ రామ్‌చరణ్, ఉపాసన దంపతులను ట్యాగ్ చేశారు. చరణ్ దంపతులు పంపిన బహుమతిలో హనుమాన్ చాలీసా పుస్తకం, శ్రీ హనుమంతుడి విగ్రహం, శ్రీరాముని పాదుకలు, అలాగే ఒక చేతివ్రాత లేఖ ఉంది.
Tqqq very much dear @AlwaysRamCharan Sir nd @upasanakonidela garu for the wonderful gift 🤍
Indebted to ur love nd support 🙏🏼May the blessings of Lord Hanuman be with you nd give more strength nd power to you Sir…
Your values r truly inspiring nd always remind us to stay… pic.twitter.com/1pt1k01zkz
— BuchiBabuSana (@BuchiBabuSana) April 4, 2025
ఆ లేఖలో రామ్‌చరణ్ బుచ్చిబాబుకి ఇలా రాశారు:
“నా మనసులో నీకెప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. హనుమంతుడి ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలి” అని.
ఈ భావోద్వేగకరమైన గిఫ్ట్‌కు బుచ్చిబాబు స్పందిస్తూ.. “ఇది నా జీవితంలో మరపురాని బహుమతి. మీ ప్రేమకు కృతజ్ఞతలు” అన్నారు.
ఇక సినిమా విషయంలోకి వస్తే.. రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా చిత్రం “పెద్ది” లో నటిస్తున్నారు. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.